టాలీవుడ్ యువ కథానాయకుల్లో విశ్వక్సేన్ అదో రకం. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సొంత టాలెంట్‌తో ఎదిగిన ఈ యంగ్ హీరో.. తన సినిమాల ప్రమోషన్ల కోసం ప్రతిసారీ ఆలౌట్ ఎటాక్ చేస్తుంటాడు. కొన్నిసార్లు వివాదాస్పదంగా మాట్లాడి.. చిత్రమైన పనులేవో చేసి అయినా తన మూవీ చర్చనీయాంశం అయ్యేలా చేస్తుంటాడు. ఐతే ఈ క్రమంలో కొన్నిసార్లు హద్దులు దాటి మాట్లాడటం వల్ల సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటాడు కూడా. విశ్వక్‌కు యాటిట్యూడ్ అంటూ అతణ్ని విమర్శిస్తుంటారు నెటిజన్లు. కానీ అవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంటాడు. గతంలో ఓ సినిమా వేడుక సందర్భంగా నన్నెవరూ లేపాల్సిన పని లేదు అంటూ అతను చేసిన కామెంట్ వైరల్ అయింది.
అప్పుడలా అన్న వాడు తన కొత్త చిత్రం గామి ప్రమోషన్లలో భాగంగా వినమ్రంగా ఓ విజ్ఞప్తి చేయడం విశేషం. తన టీంతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన విశ్వక్.. గామి లాంటి మంచి ప్రయత్నానికి అందరూ సపోర్ట్ చేయాలని.. తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఈ సినిమా గురించి మాట్లాడి ప్రమోట్ చేయాలని కోరాడు. ఈ కామెంట్ పట్టుకుని కొందరు కామెడీగా మీమ్స్ వదులుతున్నారు.
అప్పుడు నన్నెవరూ లేపాల్సిన పని లేదు అన్న విశ్వక్.. ఇప్పుడు ఇంత వినమ్రంగా మాట్లాడాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే.. మలయాళ మూవీ అయిన ప్రేమలును రాజమౌళి, మహేష్ బాబు లాంటి వాళ్లు ప్రమోట్ చేస్తుండగా.. గామి లాంటి మంచి ప్రయోగానికి టాలీవుడ్ నుంచి సపోర్ట్ లేకపోవడం గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విశ్వక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయ
This post was last modified on March 14, 2024 7:34 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…