Movie News

ఈగల్ దర్శకుడి మల్టీస్టారర్ కు మరమ్మత్తులు

ఫిబ్రవరిలో విడుదలైన రవితేజ ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి అది షూటింగ్ లో ఉండగానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇంకో సినిమా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని చిత్రీకరణ గత ఏడాది నవంబర్ లోపే కొంత భాగం చేశారు. మిరాయ్ టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఇంకా అఫీషియల్ కాలేదు. తేజ సజ్జ, దుల్కర్ సల్మాన్ హీరోలుగా మంచు మనోజ్ విలన్ గా చాలా క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాసుకున్నారని అప్పట్లో టాక్ తిరిగింది అయితే హనుమాన్ తర్వాత లెక్కలు మారిపోయాయట. తేజ సజ్జకు మార్కెట్ వచ్చింది. హిందీతో కలిపి ప్యాన్ ఇండియా హక్కులకు డిమాండ్ పెరిగింది.

దీంతో అతను నెక్స్ట్ చేయబోయే మూవీస్ కి సంబంధించి పునఃసమీక్ష చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే మిరాయ్ కు కొన్ని రిపేర్లు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. తేజకు లెన్త్ పెంచి దానికి అనుగుణంగా ఏమేం మార్పులు చేయాలో వాటన్నింటి మీద వర్క్ జరుగుతోందట. అందుకే షూట్ కి కొంత బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఏప్రిల్ లేదా మే నుంచి కొనసాగించేలా ప్రణాళిక వేసుకున్నారని తెలిసింది. దీంతో పాటు బాలకృష్ణ 109లో నటిస్తున్న దుల్కర్ సల్మాన్ రెండింటికి సమాంతరంగా కాల్ షీట్స్ ఇచ్చి వేసవిలోగా వాటి పనిని పూర్తి చేసుకునే ప్లానింగ్ లో ఉన్నాడు.

ఒకవేళ ఈగల్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ దాని ఫలితం కార్తీక్ ఘట్టమనేనిని అలెర్ట్ చేసింది. కేవలం యాక్షన్, ఎలివేషన్లతో పని జరగదని, సరైన ఎమోషన్ లేకుండా వీటితో ప్రేక్షకులను మెప్పించలేమని అర్థం చేసుకున్నాడు. అందుకే మిరాయ్ లో అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడే టైం వచ్చింది. ఇక తేజ సజ్జ వీలైనంత కమర్షియల్ మూస జోలికి వెళ్లకుండా ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. జై హనుమాన్ లో ఫుల్ లెన్త్ ఉంటుందో లేదో అనే అనుమానాల నేపథ్యంలో తన దగ్గరికొస్తున్న కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

This post was last modified on March 13, 2024 5:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago