బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. ఆపై డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఉచ్చులో పడ్డ రియా చక్రవర్తి.. పెను సంచలనానికి తెర తీసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. తాను డ్రగ్స్ వాడేదాన్నని, సుశాంత్ కూడా డ్రగ్ అడిక్టే అని ఇంతకుముందు రియా ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు వార్తలొచ్చాయి. సుశాంత్, రియాలకు ఆమె సోదరుడే డ్రగ్స్ సరఫరా చేసేవాడని కూడా వార్తలొచ్చాయి. అతణ్ని సైతం అరెస్ట్ చేసింది ఎన్సీబీ. కాగా బెయిల్ కోసం వీళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతలో విచారణలో రియా కొన్ని సంచలన నిజాలు చెప్పినట్లుగా టైమ్స్ నౌ ఛానెల్ ఒక సెన్సేషనల్ స్టోరీ ప్రసారం చేసింది.
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉండి.. ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకునేదని రియా ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు ఈ ఛానెల్ వెల్లడించింది. రకుల్‌తో పాటు సైఫ్ అలీఖాన్ తనయురాలు, సుశాంత్‌తో ‘కేదార్‌నాథ్’ సినిమా చేసిన సారా అలీ ఖాన్ సైతం మాదక ద్రవ్యాలు తీసుకునేదని ఆమె పేర్కొందట. అలాగే రియా స్నేహితురాలైన సైమోన్ కంబట్టా సైతం డ్రగ్ అడిక్టే అని ఆమె వెల్లడించిందంటున్నారు. దీనికి సంబంధించిన టైమ్స్ నౌ స్క్రోలింగ్స్ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. ఇది రకుల్, సారాలకు తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. రియా బాలీవుడ్ డ్రగ్ అడిక్ట్స్ అందరి పేర్లూ బయటపెట్టబోతందని.. మొత్తం 25 మంది దాకా పేర్లు వెలుగులోకి రాబోతున్నాయని మీడియా ఇప్పటికే వార్తలొచ్చాయి. ఒకప్పుడు టాలీవుడ్లో జరిగినట్లే ఇప్పుడు బాలీవుడ్లో పలువురికి నోటీసులు వెళ్లబోతున్నాయని.. వారిని విచారణకు పిలవడంతో పాటు డ్రగ్ టెస్టులు కూడా చేయబోతున్నారని అక్కడి మీడియా వర్గాలంటున్నాయి.
This post was last modified on September 12, 2020 6:45 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…