Movie News

ప్లాన్ సిద్ధం చేసుకున్న బాలయ్య 110

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న బాలకృష్ణ తర్వాత ఎవరితో చేస్తారనే దాని గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. బోయపాటి శీను దర్శకత్వంలో ప్రాజెక్టు లాక్ అయిన మాట నిజమే అయిన నేపథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మొదటిసారి బాలయ్య మూవీకి రంగం సిద్ధమైనట్టే. అఖండ 2నా లేక వేరే కొత్త సబ్జెక్టు రాసుకున్నారా అనే దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. మొదటి భాగం నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి అనుమతితోనే సీక్వెల్ కొనసాగించాల్సి ఉంటుంది. ఆయనేమో పెదకాపు డిజాస్టర్ దెబ్బకి ఈ మధ్య బయట కనిపించడం తగ్గించేశారు.

కథ సంగతి కాసేపు పక్కనపెడితే బాలయ్య బోయపాటి నాలుగోసారి చేతులు కలపడం ఖరారే. వచ్చే నెల ఉగాది పండగ పురస్కరించుకుని ఓపెనింగ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలుండగా ఏపీ ఎన్నికల వాతావరణం చాలా వేడిగా ఉండటంతో బాలకృష్ణ డైరీ ఖాళీగా లేదు. ఉన్నంతలో బాబీకే డేట్లు అడ్జస్ట్ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఎంత ఆలస్యంగా మొదలుపెట్టినా ముందైతే పూజా కార్యక్రమాలు చేద్దామనే నిర్ణయానికి రావడంతో బాలయ్య ప్రస్తుతం మంచి ముహూర్తం తీయించే పనిలో ఉన్నారని సమాచారం. ఒకవేళ ఓకే అనుకుంటే ఏప్రిల్ 9న ఈ లాంఛనం జరిగిపోవచ్చు.

స్కంద డిజాస్టర్ తర్వాత బోయపాటి శీను బాధ్యత రెట్టింపు అయ్యింది. ఇంకోవైపు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపు మీదున్న బాలయ్యకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో సూపర్ హిట్ ఇచ్చే తీరాలి. పైగా సింహా, లెజెండ్, అఖండ తర్వాత వచ్చే కాంబినేషన్ కావడంతో సహజంగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశ పనుల్లో ఉన్న బోయపాటి అది పూర్తి కాగానే ఫైనల్ నెరేషన్ కు రెడీ అవుతాడు. అల్లు అరవింద్ దగ్గరుండి చూసుకుంటున్నారని వినికిడి. సీనియర్ హీరోల్లో టాప్ ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్యకు లేట్ ఇన్నింగ్స్ కెరీర్ బ్రహ్మాండంగా జరుగుతోంది.

This post was last modified on March 13, 2024 1:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

3 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

4 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

4 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

5 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

6 hours ago