Movie News

‘గుంటూరు కారం’ సమస్య ‘గామి’కి కూడా..

ఈ మధ్య పేరున్న సినిమాలకు సోషల్ మీడియాలో పనిగట్టుకుని ప్రతికూల ప్రచారం చేసే బ్యాచ్‌లు తయారయ్యాయి. పోటీలో ఉన్న సినిమా దెబ్బ తింటే తమకు ప్రయోజనం అని భావించి కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తమ హీరో సినిమా పోటీలో లేకపోయినా.. ఇంకో హీరో సక్సెస్ చూడలేక అతణ్ని, తన సినిమాను డీగ్రేడ్ చేయాలన్న ఉద్దేశంతోనూ ఇలాంటి నెగెటివ్ క్యాంపైనింగ్స్ నడిపిస్తున్నారు.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’కు పనిగట్టుకుని బుక్ మై షోలో పెయిడ్ అకౌంట్స్ ద్వారా జీరో రేటింగ్స్ ఇచ్చి ఓవరాల్‌గా ఆ సినిమా రేటింగ్ తగ్గేలా కుట్ర జరగడం చర్చనీయాంశం అయింది. దాని మీద ‘గుంటూరు కారం’ టీం చర్యలకు కూడా సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఏ అప్‌డేట్ లేదు.

కట్ చేస్తే ఇప్పుడు యంగ్ హీరోగా విశ్వక్సేన్ కూడా ఇలాంటి నెగెటివ్ క్యాంపైనింగ్‌కు బాధితుడు అయినట్లు చర్చ జరుగుతోంది. విశ్వక్ కొత్త చిత్రం ‘గామి’ మంచి టాక్ తెచ్చుకుని, అంచనాలకు మించిన ఓపెనింగ్స్‌ సాధించింది. తొలి వీకెండ్లో రూ.20 కోట్ల దాకా వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా రేంజికి ఇవి పెద్ద కలెక్షన్లే. వీకెండ్ తర్వాత కూడా సినిమా పర్వాలేదనిపిస్తోంది.

ఐతే ‘గామి’ బుక్ మై షో రేటింగ్ తగ్గించడానికి ఒక బ్యాచ్ రంగంలోకి దిగిందట. ఈ విషయాన్ని స్వయంగా విశ్వకే వెల్లడించాడు. బుక్ మై షోలో పనిగట్టుకుని సింగిల్ రేటింగ్స్ ఇవ్వడంతో ఓవరాల్ రేటింగ్ పడిపోయిందని.. ఇది తన ఎదుగుదలను ఓర్చుకోలేక కొందరు పనిగట్టుకుని చేసిన దుష్ప్రచారం అని అతను ఆరోపించాడు. ఇలాంటి వాళ్ల మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కూడా అతను హెచ్చరించాడు.

This post was last modified on March 12, 2024 6:35 pm

Share

Recent Posts

వ‌రంగల్‌కు ఎయిర్‌పోర్టు… ఆ పేర్లు పెట్ట‌మ‌న్న‌ సందీప్ వంగ

ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాల‌నే నియ‌మాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, ప‌ట్ట‌ణాల‌కు కూడా విమానాశ్ర‌యాలు విస్త‌రిస్తున్నాయి. ఐతే మ‌రో తెలుగు…

7 minutes ago

‘రాకా’ అనిరుధ్ లేదా జి.వి.ప్రకాష్ అనుకుని…

‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…

10 minutes ago

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

36 minutes ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

36 minutes ago

మగాళ్లకు పీరియడ్స్ రావాలని వెయ్యిసార్లు ప్రార్థించిన నటి

మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…

2 hours ago

సంపూ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందా

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…

3 hours ago