జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర పార్ట్ 1 అక్టోబర్ 10 విడుదలను చేరుకునేందుకు పరుగులు పెడుతోంది. వినడానికి ఇంకా టైం ఉన్నట్టు అనిపిస్తున్నా చేతిలో ఉన్న ఏడు నెలలు ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కి ఎంత మాత్రం చాలవు. ఏప్రిల్ లో మంచి డేట్ వదులుకోవడం వల్ల ఫ్యాన్స్ లో రేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు వేసవి నుంచి పక్కా ప్లానింగ్ తో భారీ ఎత్తున ప్రమోషన్లు మొదలుపెట్టేందుకు టీమ్ రెడీ అవుతోంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం గోవా వెళ్ళబోతున్నారు. ఇక బాహుబలి ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం.
దేవర తండ్రి కొడుకుల కథగా తారక్ ని రెండు పాత్రల్లో కొరటాల చూపించబోతున్నారని ఇన్ సైడ్ టాక్. మొదటి భాగంలో కొడుకుకి సంబంధించిన ఘట్టాన్ని ఆవిష్కరించి సీక్వెల్ లో తండ్రి క్యారెక్టర్ ని హై వోల్టేజ్ లో రివీల్ చేస్తారని తెలిసింది. అలా అని వయసు మళ్ళిన వాడిగా జూనియర్ కనిపించడట. బాహుబలి లాగే రెండు కాలాల్లో రెండు పాత్రలను చూపించి తద్వారా ఒకదానితో మరొకటి ముడిపెట్టే విధానం ప్రత్యేకంగా ఉంటుందట. సో మహేంద్ర, అమరేంద్రగా ప్రభాస్ లో చూపించిన ఎలివేషన్ ని మించి దేవరలో జూనియర్ ఎన్టీఆర్ రూపంలో చూడొచ్చన్న మాట.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న దేవర వల్ల ఆమెకు రామ్ చరణ్ సినిమాలోనూ ఛాన్స్ దక్కిందనే టాక్ ఆల్రెడీ ఉంది. సైఫ్ అలీ ఖాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఇప్పుడు గోవాలో తను కూడా పాల్గొనబోతున్నారు. తారక్, జాన్వీల మీద ఒక పాటతో పాటు బీచ్ ఒడ్డున సముద్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లను షూట్ చేయబోతున్నారు. అనిరుద్ రవిచందర్ మిగిలిన పాటలకు సంబంధించిన పని పూర్తి చేయగానే వాటి చిత్రీకరణ కూడా కొలిక్కి వస్తుంది. ఈసారి ఎలాంటి పోస్ట్ పోన్ లేకుండా ఖచ్చితంగా విడుదల తేదీని అందుకునేలా ప్లానింగ్ చేసుకున్నారు.
This post was last modified on March 12, 2024 6:33 pm
రాయలసీమను రత్నాల సీమ చేస్తామని ఒకరు, రాయలసీమ కష్టాలు నావి, నేను వాటిని పరిష్కరిస్తానని మరొకరు… ఇలా ఏపీలో టీడీపీ…
కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైనపుడు ఫ్లాప్ అవుతుంటాయి. కానీ టీవీల్లో, ఓటీటీల్లో వాటికి మంచి స్పందన వస్తుంటుంది. కాల క్రమంలో అవి కల్ట్ స్టేటస్…
మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లలో చివరి ఘట్టం పూర్తయ్యింది. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్…
మన శంకరవరప్రసాదుగారులోని చివరి పాట వచ్చేసింది. ముందు నుంచి దీని గురించి ఓ రేంజ్ లో చెబుతూ వచ్చిన టీమ్…
ప్రభాస్ హీరోగా మారుతి రూపొందించిన రాజాసాబ్ డిసెంబరు 5నే రిలీజ్ కావాల్సింది. కానీ సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందని ఈ…
చాలా గ్యాప్ తర్వాత సమంతా ఫుల్ లెన్త్ మూవీతో రాబోతోంది. తనే నిర్మించిన శుభంలో చిన్న క్యామియో చేసినప్పటికీ అది…