శివరాత్రికొచ్చిన వాటిలో గామి మొదటి మూడు రోజులు బాగానే రాబట్టినా తర్వాత నెమ్మదించిన వైనం కనిపిస్తోంది. బ్రేక్ ఈవెన్ రెండు రోజులకే అయిపోయింది కాబట్టి టెన్షన్ లేదు కాని భారీ లాభాలు ఏ మేరకు వస్తాయనేది వేచి చూడాలి. భీమాకు మాస్ అండగా ఉంటుందనుకుంటే అది ఆదివారం వరకే కొంత మేర పరిమితమై వీక్ డేస్ లో స్లో అయిపోయింది. ప్రేమలుకి చేసిన హడావిడికి తగ్గట్టు బాక్సాఫీస్ ఫిగర్లు నమోదు కాలేదు. పెట్టుబడి వచ్చేసినా హక్కులు కొన్న కార్తికేయ ఊహించినట్టు ఇదేదో సంచలన బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలు కనుచూపు మేరలో లేవు.
ఇప్పుడు మార్చి 15 కొత్త శుక్రవారం రానుంది. ఏడుకు పైగా సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. పూరి తమ్ముడు ‘వెయ్ దరువెయ్’కి పబ్లిసిటీ బాగానే చేస్తున్నారు. నిర్మాణం నుంచే వివాదాలు రేపుతున్న ‘రజాకార్’లో అనసూయ, బాబీ సింహా లాంటి క్యాస్టింగ్ ఆసక్తి రేపుతోంది. అనన్య నాగళ్ళ ప్రధానపాత్రలో రూపొందిన ‘తంత్ర’ హారర్ మూవీ అయినప్పటికీ స్పెషల్ గా ఉంటుందని ఊరిస్తున్నారు. చైతన్య రావు హీరోగా నటించిన ‘షరతులు వరిస్తాయి’ కంటెంట్ నే నమ్ముకుంది. త్రిగున్ ‘లైన్ మ్యాన్’ కాన్సెప్ట్ పరంగా కొంచెం వెరైటీగా అనిపిస్తోంది.
మరో చిన్న చిత్రం ‘రవికుల రఘురామ’తో పాటు బిగ్ బాస్ ఫేమ్ దివి ‘లంబసింగి’ బరిలో దిగుతున్నాయి. ఇవి కాకుండా రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన సిద్దార్థ్ మల్హోతా ‘యోధ’ మీద చెప్పుకోదగ్గ అంచనాలే ఉన్నాయి. ఇన్నేసి మూకుమ్మడిగా వస్తున్నాయి కానీ దేనికీ గ్యారెంటీగా ఓపెనింగ్స్ వస్తాయని చెప్పలేని పరిస్థితి నెలకొంది. వీటిలో కనీసం రెండు మూడు మంచి టాక్ తెచ్చుకుంటే నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. లేదంటే గామి, భీమాలకు వీకెండ్ లో ఇంకో ఛాన్స్ దొరికినట్టే. ఓటిటి రిలీజులు, వెబ్ సిరీస్ లు అదే రోజు భారీ సంఖ్యలో రాబోతున్నాయి. ఆడియన్స్ ఆప్షన్లకు కొదవ లేదు.
This post was last modified on March 11, 2024 10:09 pm
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…