కరోనా టైంలో, ఆ తర్వాత కొంత కాలం ఓటీటీల దూకుడు ఏ స్థాయిలో ఉండేదో తెలిసిందే. ప్రొడ్యూసర్లు కూడా ఊహించని రేటు ఇచ్చి డిజిటల్ రైట్స్ తీసుకునేవారు. కొత్త సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయించి మరీ నేరుగా డిజిటల్ రిలీజ్‌కు ఒప్పించి భారీ రేట్లు ఇచ్చాయి అప్పట్లో ఓటీటీలు. ఈ పరిణామం చూసి నిర్మాతలు మురిసిపోయారు. కొత్త ఆదాయ వనరు దొరికిందని బడ్జెట్లు కొంచెం పెంచారు. ఈ ఆదాయం చూసుకునే హీరోలు సైతం పారితోషకాలను అయినకాడికి పెంచేశారు.
కానీ తీరా చూస్తే ప్రేక్షకులను ఓటీటీలకు అలవాటు చేయించాక నెమ్మదిగా వాటి యాజమాన్యాల తీరు మారింది. ఇంతకముందులా వేలంవెర్రిగా సినిమాలను కొనట్లేదు. మంచి కాంబినేషన్లలో తెరకెక్కిన సినిమాలకు కూడా డిజిటల్ హక్కులు అమ్ముడవడం కష్టంగా ఉంది. దీని కారణంగా కొన్ని సినిమాలే ఆగిపోవడం చూశాం.
ఐతే థియేటర్లలో పెద్ద హిట్టయిన సినిమాలకు ఆటోమేటిగ్గా డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడైపోతుంటాయి. కానీ ఇప్పుడు ఇది కూడా జరగట్లేదు. నిర్మాతలు కోరుకున్న రేట్లు ఇవ్వడానికి ఓటీటలు సిద్ధపడట్లేదు. ప్రస్తుతం సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న మలయాళ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’కు డిజిటల్ డీల్ పూర్తి కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రూ.14 కోట్ల బడ్జెట్లో తెరకెక్కి ఆల్రెడీ వరల్డ్ వైడ్ వంద కోట్ల వసూళ్ల మార్కును దాటేసింది ‘మంజుమ్మెల్ బాయ్స్’. మూడో వారంలోనూ హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతున్న ఈ చిత్రానికి ఇంకా ఓటీటీ హక్కులు అమ్ముడవలేదు.
నిర్మాతలు సినిమా సక్సెస్ రేంజ్ చూసి రూ.20 కోట్లు కోట్ చేస్తుంటే అందులో సగం మాత్రమే ఆఫర్ చేస్తున్నాయట ఓటీటీలు. పేరున్న ఓటీటీలన్నింటినీ సంప్రదించడం.. అవేవీ కూడా కోరుకున్న రేటులో 60 శాతం కూడా ఇవ్వడానికి కూడా రెడీగా లేకపోవడంతో నిర్మాతలు సైలెంట్ అయిపోయారు.
This post was last modified on March 11, 2024 8:24 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…