మాములుగా ఎంత పెద్ద దర్శకుడైనా సరే వరస ఫ్లాపులు ఉన్నప్పుడు స్టార్ హీరోలు అంత సులభంగా అవకాశం ఇవ్వరు. ఒకప్పుడు గజినీ లాంటి బ్లాక్ బస్టర్లతో సౌత్ ని ఊపేసిన మురుగదాస్ తుపాకీ వరకు ఫామ్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత ట్రాక్ తప్పింది. రజనీకాంత్ పిలిచి మరీ దర్బార్ ఇస్తే అంచనాలు అందుకోలేదు. అంతకు ముందు మహేష్ బాబు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ ని స్పైడర్ రూపంలో ఇచ్చాడు. ఇప్పటికీ ఫ్యాన్స్ దాన్ని తరచు తలుచుకుంటూనే ఉంటారు. శివకార్తికేయన్ తో ఒక ప్రాజెక్టు ఓకే చేసుకున్న దాస్ కి ఏకంగా సల్మాన్ ఖాన్ నుంచి పిలుపు వచ్చింది.
కిక్ 2 కోసం మురుగదాస్ నే దర్శకుడిగా నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా ఎంపిక చేసుకున్నట్టు ముంబై అప్డేట్. గత కొంత కాలంగా జరుగుతున్న స్క్రిప్ట్ పనులు ఒక కొలిక్కి వచ్చాయట. రవితేజ కిక్ ని 2014లో రీమేక్ చేసుకుని సల్మాన్ బాలీవుడ్ లో పెద్ద హిట్టు కొట్టాడు. అయితే తెలుగులో కిక్ 2 సూపర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో సాజిద్ ఆ కథ వర్కౌట్ కాదని గుర్తించి ఫ్రెష్ గా ఇంకో సబ్జెక్టు తయారు చేసుకున్నాడు. తొలుత వేరే దర్శకుడితో అనుకుంటే సాధ్యపడకపోవడంతో చివరికి మురుగదాస్ ని రంగంలో దించారట. 2025 రంజాన్ విడుదలని టార్గెట్ చేసుకున్నట్టు తెలిసింది.
ఈ లెక్కన ఎన్ని ఫ్లాపులు ఉన్నా దాస్ ని అదృష్టం ఏ స్థాయిలో వెంటపడుతోందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయనకి ఇది మొదటి హిందీ సినిమా కాదు. ఇంతకు ముందు అక్షయ్ కుమార్ హాలిడే, అమీర్ ఖాన్ గజిని, సోనాక్షి సిన్హా అకీరా తీశారు. ఇప్పుడు కిక్ 2 నాలుగోది అవుతుంది. పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో ప్రకటించబోతున్నారు. తమిళం, హిందీలో బాగానే సక్సెస్ అందుకున్న మురుగదాస్ తెలుగులో మాత్రం మహేష్ బాబు, చిరంజీవిలకు చేదు ఫలితాలు ఇవ్వడం బ్యాడ్ లక్. పుష్ప టైంలో అల్లు అర్జున్ తో ఒక సినిమా అనుకున్నాడు కానీ అది కార్యరూపం దాల్చలేదు.
This post was last modified on March 10, 2024 9:36 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…