ఇటీవలే బాలీవుడ్ లో విడుదలైన సైతాన్ బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్లు నమోదు చేస్తోంది. అజయ్ దేవగన్, జ్యోతిక జంటగా మాధవన్ విలన్ గా వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ కి మిక్స్డ్ టాక్ వినిపించినా వసూళ్లు మాత్రం బాగున్నాయి. ముంబై లాంటి నగరాల్లో శనివారం వీకెండ్ అర్ధరాత్రి షోలు వేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గుజరాతి బ్లాక్ బస్టర్ వష్ రీమేక్ గా రూపొందిన ఈ చేతబడి డ్రామాని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో వెంకటేష్ ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే షో చూసిన వెంకీకి కాన్సెప్ట్ బాగా నచ్చిందట. కాకపోతే పెద్ద రిస్క్ పొంచి ఉంది.
సైతాన్ లో మాధవన్ ది వన్ మ్యాన్ షో. పూర్తి నెగటివ్ షేడ్స్ లో సాగుతుంది. క్లైమాక్స్ లో ఏకంగా భయపెట్టేలా విశ్వరూపం చూపించాడు. అజయ్ దేవగన్ ది అధికశాతం భయం చూపిస్తూ రెండు మూడు ఎమోషన్స్ మీద నడిచిపోతుంది. ఒకవేళ వెంకటేష్ చేయాలి అనుకుంటే ఈ పాత్ర ఆయన ఇమేజ్ కి సూట్ కాదు. పోనీ మాధవన్ క్యారెక్టర్ తీసుకుంటే అంత నెగటివ్ షేడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ అస్సలు ఒప్పుకోరు. అప్పుడెప్పుడో నాగవల్లిలో కాసేపు అలా కనిపిస్తేనే తిరస్కరించారు. ఒకవేళ మాధవనే ఒప్పుకుంటే తనకొచ్చే ప్రాధాన్యం ముందు వెంకీ స్పేస్ తగ్గిపోతుంది.
ప్రస్తుతానికి ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ఆ మధ్య డిసెంబర్ లో మోహన్ లాల్ నేరుని రీమేక్ చేసే ప్రపోజల్ వస్తే వద్దనుకున్న వెంకీ మంచి పని చేశారు. తర్వాత ఓటిటిలో చూసిన మన ఆడియన్స్ అంత సుదీర్ఘమైన కోర్ట్ డ్రామాని గొప్పగా ఉందని అనలేకపోయారు. ఇప్పుడు సైతాన్ విషయంలో అలాగే ఆలోచిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందబోయే సంక్రాంతికి వస్తున్నాం(ప్రచారంలో ఉన్న టైటిల్), రానా నాయుడు సీజన్ 2 తప్ప వెంకటేష్ అఫీషియల్ గా ఇచ్చిన కమిట్ మెంట్లు ఇంకేం లేవు.
This post was last modified on March 10, 2024 9:30 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…