జాతీయ అవార్డు సాధించిన కలర్ ఫోటోలో నటించినా హీరోయిన్ చాందిని చౌదరికి ఆశించిన బ్రేక్ దక్కలేదు. అందం, టాలెంట్ రెండూ ఉన్నా అవకాశాల విషయంలో విషయంలో వెనుకబడే ఉన్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఆ తర్వాత కిరణ్ అబ్బవరంతో సమ్మతమే లాంటివి చేసింది కానీ పేరు తప్ప ఆఫర్లు రాలేదు. కానీ వీటికన్నా ముందు ఎప్పుడో ఒప్పుకున్న గామి ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తోంది. విశ్వక్ సేన్ హీరో అయినప్పటికీ తనతో పాటు సగానికి పైగా సమానంగా ప్రయాణం చేసే డాక్టర్ జాహ్నవి పాత్రలో ఆమె పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులు పడుతున్నాయి.
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా నిండైన దుస్తులతో గడ్డలు కట్టించే చలిలో చాందిని చౌదరి తీసుకున్న రిస్క్ గురించి విశ్వక్ ప్రత్యేకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. వాష్ రూమ్ లేని ఇబ్బందిని గుర్తుపెట్టుకుని మంచి నీళ్లు తాగకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా పడిన శ్రమను గురించి వివరించి చెప్పాడు. గామి తనకు ఎంత బ్రేక్ ఇస్తుందో వేచి చూడాలి. తమిళంలో ఇటీవలే సబా నాయగన్ తో ఎంట్రీ ఇచ్చినా అది ఆశించిన ఫలితం అందుకోలేదు. సూపర్ ఓవర్, గాలి వాన, అన్ హర్డ్ లాంటి వెబ్ సిరీస్ లు గుర్తింపు ఇచ్చాయి కానీ వాటికున్న రీచ్ తక్కువే.
ఇప్పుడు బాలకృష్ణ 109లో చాందిని చౌదరి ఓ కీలక పాత్ర చేస్తోంది. క్యారెక్టర్ తాలూకు డీటెయిల్స్ బయటికి చెప్పడం లేదు కానీ భగవంత్ కేసరి తరహాలో బాలయ్యతో బలమైన బాండింగ్ ఉండేలా దర్శకుడు బాబీ కొల్లి డిజైన్ చేశాడని టాక్. ఇది విజయం సాధిస్తే చాందిని కెరీర్ ఊపందుకోవచ్చు. అయినా తెలుగు టాలెంట్ ని గుర్తించడం లేదని వాపోయే దర్శక నిర్మాతలు వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఉన్న ఇలాంటి వాళ్ళను గుర్తించకపోవడం విచిత్రం. 2015లో కేటుగాడుతో ఎంట్రీ ఇచ్చిన చాందిని చౌదరికి మొదటి థియేటర్ సక్సెస్ చూసేందుకు తొమ్మిదేళ్లు పట్టింది.
This post was last modified on March 10, 2024 1:34 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…