ధనుష్ – నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రానికి కుబేర టైటిల్ ని లాక్ చేస్తూ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్టర్ లో మాసిన గెడ్డం, పాత దుస్తులతో ఉన్న ధనుష్ తో పాటు అందులో శివ పార్వతుల చిత్రపటం ఒకటి ఉండటం ఆడియన్స్ లో ఆసక్తి రేపింది. అయితే ఇదేదో ఆషామాషీగా సెట్ చేసుకున్న బ్యాక్ డ్రాప్ కాదట. అదేంటో చూద్దాం. కుబేరుడు అంటే కోటీశ్వరుడని సాధారణ వాడుక భాషలో అంటారు కానీ నిజానికి ఆయన అందగాడు కాదు. ఏడుకొండలవాడికే అప్పులిచ్చాడు కానీ రూపం పరంగా మాత్రం చూడచక్కని దేహం కాదు.
శేఖర్ కమ్ముల ఈ పాత్ర డిజైన్ కోసం కుబేరుడి పూర్వ జన్మ అయిన గుణనిధి రిఫరెన్స్ తీసుకున్నారట. పురాణాల్లో సూత మహర్షి చెప్పిన ప్రకారం బ్రాహ్మణ వంశానికి చెందిన గుణనిధి వ్యసనాలకు, దొంగతనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు వెతుక్కుంటాడు. వాటిలో జూదం ఒకటి. తండ్రికి నిజం తెలిశాక గుణనిధి కట్టుబట్టలతో పారిపోయి ఒక శివాలయంలో తల దాచుకుంటాడు. అక్కడ జాగారం చేసిన భక్తులకు పుణ్యం దక్కే పని చేశాక కాలుజారి నంది తల తగిలి అక్కడే చనిపోతాడు. ఆ ఫలమే మరుజన్మలో కుబేరుడి పుట్టుక. కృతయుగంలో జన్మిస్తాడు.
కుబేరుడు మహా శివ భక్తుడు. ఆ తపస్సుకు మెచ్చే గరళకంఠుడు అద్భుత వరాలు ఇస్తాడు. శేఖర్ కమ్ముల ఈ రెండు నేపధ్యాలను తీసుకుని ధనుష్ చేస్తున్న పాత్రకు అన్వయించి ముంబై బ్యాక్ డ్రాప్ తో 90 దశకంలో ఒక బిచ్చగాడు ఎలా మాఫియా స్థాయికి ఎదిగాడనే పాయింట్ ని చూపిస్తారని టాక్. నాగార్జున తనను వెంటాడే ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్ గా కనిపిస్తారని మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఇవన్నీ అన్వయించుకుంటే శేఖర్ కమ్ముల వేసిన ప్లాన్ అంచనాలకు మించేలా ఉంది. అంత దీనమైన గెటప్ లో ధనుష్ ఎందుకు కనిపించాడో అర్థమయ్యిందిగా. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కుబేరకు ప్రధాన ఆకర్షణ.
This post was last modified on March 10, 2024 8:48 am
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…