రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయకు ఇప్పటికే ప్రొడక్షన్లో మంచి అనుభవం ఉంది. అతను తండ్రి తీసే సినిమాల ప్రొడక్షన్లో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. అది కాకుండా సొంతంగా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలన్న ఆసక్తి ఉంది. పూర్తి స్థాయి నిర్మాతగా మారే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ.. అది ఇంకా ఒక కొలిక్కా రాలేదు.
గతంలో ‘ఆకాశవాణి’ అనే సినిమాల భాగస్వామి అయి.. మళ్లీ తప్పుకున్నాడు. ఇప్పుడతను నిర్మాతగా చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా కార్తికేయ మలయాళ హిట్ మూవీ ‘ప్రేమలు’ను తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మలయాళ వెర్షన్ హైదరాబాద్‌లో బాగా ఆడుతుండగా.. తెలుగులో అనువాదం చేసి ఈ శుక్రవారమే రిలీజ్ చేశాడు కార్తికేయ.
ఎక్కడా మలయాళ నేటివిటీ లేకుండా తెలుగు సినిమా అనిపించేలా కథ, నేపథ్యం ఉండటం ఈ సినిమాకు ప్లస్. ఒరిజినల్లో కూడా ఈ కథ హైదరాబాద్ నేపథ్యంలోనే నడుస్తుంది. ఇక ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ ఫేమ్ ఆదిత్య హాసన్‌తో ట్రెండీ డైలాగులు రాయించడం.. మీమ్స్‌ను ఫుల్లుగా వాడేసుకోవడంతో ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.
సినిమా జాలీ రైడ్‌లాగా సరదాగా సాగిపోవడం.. హీరో హీరోయిన్ల పాత్రలు, వాటిని పోషించిన నటులు లవబుల్‌గా అనిపించడం సినిమాకు ప్లస్ అయింది. మొత్తంగా సినిమా మంచి టాక్ తెచ్చుకుని తొలి రోజు మంచి వసూళ్లతో నడిచింది. సాయంత్రం షోలు కొన్ని ఫుల్ అయ్యాయి కూడా.
ముందు వారంలో వచ్చిన సినిమాలన్నీ వాషౌట్ అయిపోవడంతో ‘ప్రేమలు’కు మంచి సంఖ్యలో స్క్రీన్లు దక్కాయి. రెండో రోజు ఈ చిత్రానికి స్క్రీన్లు, షోలు కూడా పెరిగాయి. తక్కువ మొత్తానికి రైట్స్ తీసుకుని మంచి క్వాలిటీతో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేయడంతో కార్తికేయకు ఈ సినిమా మంచి లాభాలే తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.
This post was last modified on March 9, 2024 9:17 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…