నందమూరి బాలకృష్ణ ఫలానా బ్రాండు మద్యం తాగుతాడట అని అభిమానులు మాట్లాడుకునేవాళ్లు ఒకప్పుడు. అప్పుడది ఒక ఊహాగానం లాగే ఉండేది. కానీ బాలయ్య తాగే బ్రాండు ఏదో తర్వాత ఫొటోల ద్వారా వెల్లడయ్యాయి. ఇప్పుడు తను చేసే షోలు, సినిమాల ద్వారా కూడా ఆ బ్రాండును ప్రమోట్ చేసేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ.
‘జై సింహా’ అనే సినిమాలో బాలయ్య తన బ్రాండు మద్యం తాగుతూ కనిపించాడు. ఐతే ఆ సీన్ కనిపించీ కనిపించనట్లుగా ఉంటుంది. ఆ తర్వాత బాలయ్య చేసే టాక్ షోకు అదే బ్రాండు ప్రధాన స్పాన్సర్‌గా మారింది. ఇప్పుడు బాలయ్య.. బాబీ దర్శకత్వలో కొత్త చిత్రంలో బ్రాండ్ ప్రమోషన్ ఒక రేంజిలో జరిగేలా ఉంది. ఈ సినిమా ప్రి లుక్‌లో కనిపించిన ఆ బ్రాండు మద్యం.. మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన ప్రి టీజర్‌లోనూ దర్శనమిచ్చింది.
ఒక హీరో తాగే మద్యం బ్రాండు గురించి ఆంతరింగిక చర్చల్లో తమాషాగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ.. పబ్లిక్‌లో మరీ ఇంత ప్రమోషన్, డిస్కషన్ అవసరమా అన్నది ప్రశ్న. ఇది మంచి సంకేతాలు ఇవ్వదన్నది విజ్ఞుల అభిప్రాయం. సినిమాలు, హీరోలను చూసి జనం, అభిమానులు ప్రభావితం అయిపోతారా అని.. సినిమాల్లో అంతా మంచే చూపించాలా అని.. అలా అయితే సినిమాలు తీయలేం అని వాదించవచ్చు. కానీ పనిగా ఒక చెడు అలవాటును పాజిటివ్ కోణంలో చూపించడం కరెక్టా అన్నది కూడా ఆలోచించాలి. ఒక హీరో ఫలానా బ్రాండు తాగుతాడు అనే విషయం పదే పదే చర్చకు వస్తే.. అభిమానులు దాన్ని క్రేజీగా తీసుకుని అలవాటు పడడానికి ఆస్కారముంటుంది.
యూత్ ఎక్కువగా సిగరెట్లకు బానిస కావడానికి తమ హీరోలు స్టైలుగా పొగతాగి వదిలే సీన్లు కొంత కారణమవుతాయన్నది కాదనలేని నిజం. దాన్నో స్టైల్ సింబల్‌గా భావిస్తారు. ఇప్పుడు మద్యం తాగడాన్ని కూడా సినిమాల్లో అంతే జనరలైజ్ చేస్తున్నారు. పైగా ఇందులో పర్టికులర్ బ్రాండ్ ప్రమోషన్ కూడా జరుగుతోంది.
ఇలా పనిగట్టుకుని సినిమాల్లో, షోలో ఒక మద్యం బ్రాండును ప్రమోట్ చేయడం కరెక్టా అన్నది ప్రశ్న. బాలయ్య మద్యం తాగడం ఆయన వ్యక్తిగత విషయం. కానీ దాన్ని సినిమాలు, షోల ద్వారా కూడా ప్రచారం చేయడమే అభ్యంతరకరం. ఓవైపు ప్రజా ప్రతినిధిగా, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌గా బాధ్యతాయుతమైన హోదాల్లో ఉంటూ.. బాలయ్య ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on March 9, 2024 3:03 pm
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్యంతర…