నిన్న విడుదలైన గామికి ముందు నుంచి ఏర్పడ్డ అంచనాలకు తగ్గట్టే టాక్ రావడంతో మొదటి రోజు ఏకంగా 9 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం ట్రేడ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. మాములుగా మాస్ కంటెంట్ కే ఎక్కువ ఆదరణ ఉండే సీడెడ్ లాంటి ప్రాంతంలో యాభై లక్షలకు పైగా వసూలు చేయడం ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని తేటతెల్లం చేస్తోంది. టాక్ రాక ముందు గోపిచంద్ భీమా వల్ల మాస్ సెంటర్స్ లో గట్టి పోటీ ఉంటుందనే అంచనాలకు భిన్నంగా విశ్వక్ సేన్ సినిమా ఇలాంటి ఫిగర్లు నమోదు చేయడం విశేషం. నిన్న సెలవు రోజుని పూర్తిగా వాడేసుకుంది.
అన్ని ఏరియాల్లో చూసుకుంటే నైజామ్ లో గామి చాలా స్ట్రాంగ్ గా ఉంది. మల్టీప్లెక్సుల్లో భారీ ఫిగర్లు నమోదవుతున్నాయి. వీకెండ్ మొత్తం కంట్రోల్ లోకి వచ్చేలా ఉంది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ ని రప్పించేలా చేసుకోవడం తర్వాతి రోజుల్లో గామి స్టేటస్ ని నిర్ణయించనుంది. ఏ సర్టిఫికెట్ కావడంతో పలు చోట్ల పిల్లల్ని అనుమతిస్తారో లేదోననే అనుమానంతో కుటుంబాలు వెళ్లేందుకు ఆలోచిస్తున్నాయి. ఇలాంటివి కొంత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. యానిమల్, సలార్ లాగా హీరో ఎలివేషన్ల మీద నడిచే కంటెంట్ కాకపోవడంతో దీని ఇంపాక్ట్ గామి మీద ఉండే ఛాన్స్ కొట్టిపారేయలేం.
దర్శకుడు విద్యాధర్ కి ఫుల్ మార్కులు పడుతున్నాయి. నెరేషన్ నెమ్మదిగా ఉందన్న కామెంట్ ని కాదనలేం కానీ పరిమిత బడ్జెట్ లో ఇంత క్వాలిటీ విజువల్స్, హిమాలయాలు, హరిద్వార్, కాశి లాంటి రిస్కీ ప్రాంతాల్లో షూట్ చేసిన విధానం మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. ఆదివారం దాకా ఢోకా లేకపోయినా సోమవారం నుంచి డ్రాప్ ని పరిమితంగా మేనేజ్ చేసుకోవడం గామి ముందున్న సవాల్. కాంపిటీషన్ లో ఉన్న భీమాకు రొటీననే టాక్ రాగా మలయాళం డబ్బింగ్ ప్రేమలు మెల్లగా పికప్ అవుతోంది. సో కలెక్షన్ల లెక్కలో చూసుకుంటే ఫస్ట్ డే విజేత నిస్సందేహంగా గామినే.
This post was last modified on March 9, 2024 11:35 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…