ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా అంటే.. గామినే. ఒక సినిమాకు ఎక్కువ టైం పడితే రెండేళ్లు తీస్తారు.. మూడేళ్లు తీస్తారు.. కానీ ఈ సినిమా మొదలుపెట్టి పూర్తి చేసేలోపు ఆరేళ్లు గడిచిపోయాయి. పేరుకు చిన్న సినిమా కానీ.. ఈ సినిమా విజువల్స్ చూస్తే ఒక భారీ చిత్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా కనిపించింది టీజర్, ట్రైలర్ చూస్తే. అవే ప్రేక్షకులను అమితాశ్చర్యానికి గురి చేశాయి.
ఇక సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆ ఆసక్తితోనే తొలి రోజు థియేటర్లకు అభిరుచి ఉన్న ప్రేక్షకులు బాగానే కదిలారు. కొన్ని సినిమాలు ప్రోమోల వరకు ఆహా అనిపించి.. థియేటర్‌కు వెళ్లాక ఉస్సూరుమనిపిస్తుంటాయి. కానీ గామి ఆ కోవకు చెందిన సినిమా కాదని తొలి ఫ్రేమ్ నుంచి చివరి వరకు అర్థమవుతూనే ఉంటుంది.
అఘోరాల నేపథ్యంలో వచ్చే తొలి ఎపిసోడ్ నుంచే విజువల్‌గా గామి కట్టి పడేస్తుంది. ఆ తర్వాత మహా కుంభమేళా.. ఆపై హిమాలయాలు.. అలాగే ఇండియా-చైనా బోర్డర్లో ఉండే ఒక సీక్రెట్ లేబొరేటరీ అంటూ చూపించే ప్రాంతం.. ఇలా ప్రతి చోటా గామి విజువల్ మాయాజాలాన్ని చూడొచ్చు. హిమాలయాలు.. సీక్రెట్ ల్యాబ్ నేపథ్యంలో వచ్చే సీన్లయితే హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయి.
అసలు అనుభం లేని డైరెక్టర్.. మిగతా టెక్నీషియన్లు అందరూ కూడా కొత్త వాళ్లే. వీళ్లకు భారీ బడ్జెట్ కూడా అందుబాటులో లేదు. పరిమిత వనరులతో, తక్కువ కాస్ట్ అండ్ క్రూతో సినిమా తీస్తూ ఇలాంటి విజువల్స్ రాబట్టడం.. వీఎఫెక్స్ అంత బాగా చేయించుకుని తెర మీద అంత మంచి ఔట్ పుట్ తీసుకురావడం అసామాన్యమైన విషయం. తక్కువ బడ్జెట్లో గొప్ప ఔట్ పుట్ రాబట్టుకునే విషయంలో టాలీవుడ్‌కు గామి ఒక పాఠంలా మారుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on March 8, 2024 9:41 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…