అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న పుష్ప పార్ట్ 2 ది రూల్ ఆగస్ట్ 15 విడుదలకు ఇంకో అయిదు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటికే భారీగా ఉన్న అంచనాలు మరింత ఎగబాకనున్నాయి. మైత్రి మేకర్స్ ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. నెలల క్రితం రిలీజ్ చేసిన చిన్న టీజర్ తప్ప ఎలాంటి వీడియో కంటెంట్ మళ్ళీ వదల్లేదు. గంగమ్మ జాతర స్టిల్ ని ప్రత్యేకంగా వదలడం మినహాయించి ఇంకెలాంటి అప్డేట్స్ లేవు. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ డే అండ్ నైట్ పుష్పనే ప్రపంచంగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ఇక అసలు పాయింట్ కు వస్తే పుష్ప 2లో అనసూయ పాత్ర చాలా కీలకంగా వ్యవహరించనుందని యూనిట్ టాక్. మొదటి భాగంలో దాక్షాయణిగా కనిపించిన ఈమెకు కథ ప్రకారం రెండు రివెంజ్ పాయింట్లున్నాయి. ఒకటి పుష్ప చేతిలో తమ్ముడు చనిపోవడం. రెండు అతని కారణంగానే మంగళం శీను అలియాస్ సునీల్ ని భర్తని చూడకుండా తన చేతులతోనే స్వయంగా గొంతుకు గాయం చేయాల్సి రావడం. వీటికి ప్రతీకారంగా ఫహద్ ఫాసిల్ చేసిన భన్వర్ సింగ్ షెకావత్ తో చేతులు కలిపి ఎర్రచందనం మాఫియాని ఆమె చేతుల్లోకి తీసుకునే ఎపిసోడ్లు సుకుమార్ బాగా తీశారని వినికిడి.
ఇవి కనక ఎడిటింగ్ కు గురి కాకుండా సరిగ్గా పేలితే రంగస్థలంలో రంగమ్మత్తని మించి గుర్తింపు రావడం ఖాయమని రషెస్ చూసినవాళ్ల నుంచి వినిపిస్తున్న మాట. సునీల్ ప్రాధాన్యం కూడా పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం కీలక భాగాల చిత్రీకరణలో బిజీగా ఉన్న సుకుమార్ స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ ఎంపిక చేసే తతంగం ఎంతకీ తెమలక సతమతమవుతున్నారట. శ్రీలీల, జాన్వీ కపూర్, దిశా పటాని ఇలా పలు ఆప్షన్లు ట్రై చేసి వర్కవుట్ కాక వేరే ఛాయస్ చూస్తున్నారట. జూన్ లోగా పాటలతో సహా మొత్తం పూర్తయితే తప్ప పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీకి తగినంత సమయం దొరకదు.
This post was last modified on March 7, 2024 10:58 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…