స్టార్ హీరోల సినిమాలు ఏవైనా ఇలా మొదలయ్యాయంటే.. అలా అభిమానుల నుంచి అప్‌డేట్స్ కోసం డిమాండ్లు మొదలైపోతాయి. రెగ్యులర్ ఇంటర్వల్స్‌లో వాళ్లకు ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉండాలి. మా పని మేం చేసుకుంటుంటే ఎంతసేపూ అప్‌డేట్ అప్‌డేట్ అంటే ఎలా అని జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు అసహనం వ్యక్తం చేసినా.. అభిమానుల గొడవ అభిమానులదే. ఈ మధ్య కాలంలో అప్‌డేట్ అప్‌డేట్ అంటూ అడిగి అడిగి విసుగెత్తిపోయిన ఫ్యాన్స్ అంటే.. రామ్ చరణ్ అభిమానులే.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ నుంచి ఏదైనా విశేషం బయటికి వస్తుందేమో అని వాళ్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఒక పాట రిలీజ్ చేస్తామని చాలా నెలలుగా ఊరిస్తోంది చిత్ర బృందం. కానీ అది ఎంతకూ బయటికి రావట్లేదు. గతంలో ఆ పాటకు సంబంధించి రా వెర్షన్ ఆన్ లైన్లో లీక్ అవ్వడం తెలిసిందే. ఈ పాట గతంలో అనుకున్న ప్రకారం లాంచ్ కాకపోవడానికి అది కూడా ఒక కారణమే.
ఐతే ఎట్టకేలకు ‘గేమ్ చేంజర్’ నుంచి పాట లాంచ్ కాబోతున్న విషయం దాదాపుగా ఖరారైనట్లే కనిపిస్తోంది. ‘గేమ్ చేంజర్’ నిర్మాత దిల్ రాజు స్వయంగా ఈ సినిమా అప్‌డేట్ గురించి కన్ఫర్మేషన్ ఇచ్చారు. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘లవ్ మి’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో రామ్ చరణ్ అభిమానులకు హుషారునిచ్చే మాట చెప్పారు రాజు. ఈ సినిమా అప్‌డేట్ గురించి అభిమానులు సోషల్ మీడియాలో, బయట చాలా గొడవ చేస్తున్నారని.. మార్చి 27న చరణ్ పుట్టిన రోజు కానుకగా అప్‌డేట్ ఇస్తున్నామని రాజు వెల్లడించాడు. దీంతో ఆడిటోరియంలో చరణ్ అభిమానులు ఆనందం మిన్నంటింది.
మరోవైపు నానితో తాను ప్రొడ్యూస్ చేయబోయే కొత్త సినిమా కబురు కూడా చెప్పాడు రాజు. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరెకెక్కనున్న ఈ చిత్రానికి అంతా సిద్ధమైందని చెబుతూ ‘యెల్లమ్మ’ అని ఈ సినిమాకు ప్రచారంలో ఉన్న పేరును కూడా ఆయన ఖరారు చేశారు.
This post was last modified on March 7, 2024 10:55 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…