గత ఏడాది బలగంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దిల్ రాజు వారసుల స్వంత ప్రొడక్షన్స్ ఇప్పుడు ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’ తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవలే పెళ్లి కొడుకుగా మారిన ఆశిష్ రెడ్డి హీరోగా, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపొందించారు. మాములుగా కథల కొరతతో టాలీవుడ్ ఎంతగా కొట్టుమిట్టాడుతొందో చూస్తున్నాం. అందులోనూ ఒకే తరహా పాయింట్లతో హారర్ జానర్ రొటీన్ గా మారిపోయింది. అందులో ఒక లవ్ స్టోరీ తీయడం వెరైటీ ఐడియా. లవ్ మీ బృందం అదే చేసింది. ఇందాక రిలీజ్ చేసిన టీజర్ లో క్లారిటీ ఇచ్చారు.
ఎక్కడో పాడుబడిన బంగాళాలో ఓ అందమైన దెయ్యం ఉంటుంది. దాన్ని ఒక్కసారి చూసినవాళ్లకు నెక్స్ట్ చావు తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అందుకే ఎవరూ ఆ ఛాయలకు వెళ్లకుండా ఉంటారు. ఓ కుర్రాడికి సరదా పుడుతుంది. కేవలం చూడటమే కాదు ఆ దెయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన స్నేహితులతో పాటు అక్కడికి వెళ్లేలా చేస్తుంది. కోరి మరీ ప్రమాదాలకు స్వాగతం చెప్పే అతనికి అక్కడికి వెళ్ళాక అనూహ్యమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఏదో తమాషాకి అనుకున్న ప్రేమ సీరియస్ గా మారిపోతుంది. ప్రాణాల మీదకు తెస్తుంది. అదెలాగో థియేటర్లోనే చూడాలి.
ఆర్య తర్వాత అంత పాజిటివ్ వైబ్ దీనికే అనిపించిందని దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే చాలా క్వాలిటీ టీమ్ ని సెట్ చేసుకున్నారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకులు పిసి శ్రీరామ్ కెమెరా బాధ్యతలు తీసుకోగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. మాములుగా ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాకు టీమ్ లో యూత్ ఎక్కువగా ఉంటారు. దానికి భిన్నంగా అరుణ్ అదే పనిగా అనుభవజ్ఞులు తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. త్వరలో విడుదల కాబోతున్న లవ్ మీ నుంచి వచ్చే పాటలు కూడా ట్రెండ్ సెట్టర్ లా ఉంటాయని దిల్ రాజు ప్రత్యేకంగా ఊరిస్తున్నారు
This post was last modified on March 7, 2024 5:32 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…