తక్కువ బడ్జెట్ తో తీసే సినిమాలకు మంచి ఆప్షన్ గా నిలుస్తున్న కుర్ర హీరో సుహాస్ కు ఇటీవలే విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ఆశించినంత పెద్ద ఫలితం ఇవ్వలేదు కానీ కమర్షియల్ గా నిర్మాతలు గట్టెక్కే వసూళ్లను తెచ్చింది. అంతకు ముందు రైటర్ పద్మభూషణ్ ద్వారా యూత్ తో పాటు ఫ్యామిలీస్ కు దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరస రిలీజులతో బిజీగా ఉన్న సుహాస్ త్వరలో ప్రసన్న వదనంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇవాళ రిలీజ్ చేసిన టీజర్ లో కాన్సెప్ట్ వైవిధ్యంగా అనిపించి అంచనాలు రేకెత్తించేలా ఉంది.
అర్జున్ వైకె దర్శకత్వం వహించిన ఈ వెరైటీ థ్రిల్లర్ లో ఫేస్ బ్లైండ్ నెస్ అనే పాయింట్ తీసుకున్నారు. అంటే అవతలి వాళ్ళ మొహాలు కనిపించలేని జబ్బు. చుట్టూ పరిసరాలు అన్నీ స్పష్టంగా ఉన్నా సరే ఎదురుగా ఉండే వ్యక్తులను పోల్చుకోలేడు. దీనికి లవ్, క్రైమ్ ని జోడించి డిఫరెంట్ గా ట్రై చేసినట్టున్నారు. నిజానికి సుహాస్ కు ఇలాంటి ఎక్స్ పరిమెంట్లు చాలా అవసరం. రొటీన్ ఫార్ములా జోలికి వెళ్లే ఇమేజ్ తనకు లేదు. జనాలను థియేటర్లకు రప్పించాలంటే కంటెంట్ తప్ప వేరే ఆప్షన్ లేదు. పైగా గ్లామర్ తో మాస్ వర్గాలను ఆకట్టుకునే సబ్జెక్టులు చేయలేడు కాబట్టి ఇలాంటివే బెస్ట్.
పోటీ విపరీతంగా ఉన్న టైంలో క్రియేటివిటీని చూపించే ప్రయోగాలు మార్కెట్ ని పెంచుతాయి. అలా అని ఆడియన్స్ కి కనెక్ట్ కాలేని వాటిని తీసుకున్నా ఇబ్బందే. పారితోషికం పెంచుతున్నారటగా అని అడిగిన ప్రశ్నకు ఏం నేను బ్రతకొద్దా అంటూ నవ్వుతు సమాధానం ఇచ్చిన సుహాస్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన మూడు కోట్ల రెమ్యునరేషన్ ప్రచారాన్ని మాత్రం అంగీకరించలేదు. ఇకపై స్పీడ్ తగ్గిస్తానని, వేగంగా సినిమాలు చేయడం వల్ల క్వాలిటీ దెబ్బ తినే ప్రమాదముందని చెబుతున్నాడు. ఇదీ మంచిదే . ప్రసన్న వదనంతో పాటు గొర్రె పురాణం, శ్రీరంగ నీతులు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
This post was last modified on March 7, 2024 2:59 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…