మెగా కాంపౌండ్ హీరోలు డిజాస్టర్లతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఏకంగా కెరీర్లు ప్రమాదంలో పడి నిర్మాణంలో ఉన్న సినిమాల బడ్జెట్లు పునః సమీక్షించే దాకా తీసుకెళ్తున్నారు. వరుణ్ తేజ్ ఆల్రెడీ మూడు చేదు ఫలాలు తిన్నాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ మూడూ ఒకదాన్ని మరొకటి టపా కట్టేశాయి. బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న వైష్ణవ్ తేజ్ తర్వాత కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ రూపంలో తన టేస్ట్ ఎంత బ్యాడ్ అవుతోందో మళ్ళీ మళ్ళీ ఋజువు చేస్తున్నాడు. వీళిద్దరి మార్కెట్ రిస్క్ లో పడి కలిసే ముందు నిర్మాతలు ఆలోచించేలా చేసుకున్నారు.
సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో మంచి విజయం నమోదు చేసుకున్నా గాంజా శంకర్ ఏవో కారణాల వల్ల ఆగిపోవడం ఊహించని పరిణామం. నిజంగా క్యాన్సిలయ్యిందా లేక పెండింగ్ లో ఉంచారా అనేది సితార మేకర్స్ చెప్పడం లేదు. ఇంకోవైపు అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ సిచువేషన్ ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. అల్లు అరవింద్ బ్యాకప్ ఉన్నా నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఊర్వశివో రాక్షసివోకి డీసెంట్ టాక్ వచ్చినా ఫెయిల్యూరయ్యింది. టెడ్డి ఎప్పుడు పూర్తవుతుందో అంతు చిక్కడం లేదు. ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు కథలతో వస్తున్నా ఏదీ కొలిక్కి రావడం లేదు.
రామ్ చరణ్ సైతం ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఆచార్య రూపంలో తండ్రితో కలిసి షాక్ తిన్నాడు. గేమ్ ఛేంజర్ మూడేళ్లుగా నిర్మాణంలో ఉంది. ఇలా మెగా కుర్రాళ్లందరూ ఏదో రూపంలో బ్రేకులు వేసుకుంటూనే ఉన్నారు. మెగా లెగసికి పెద్దగా చిరంజీవి సలహాలు సూచనలు వీళ్లకు అవసరమయ్యేలా ఉంది. మాములుగా అయితే ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ దీని వల్ల కెరీర్లు దెబ్బ తింటున్నాయి.
This post was last modified on March 7, 2024 3:39 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…