సీనియర్ దర్శకులు కెఎస్ రవికుమార్ ఇటీవలే ఒక తమిళ ఈవెంట్ లో బాలకృష్ణ గురించి చేసిన కామెంట్లు అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. సెట్లో ఉన్నప్పుడు బాలయ్య కోపం, విగ్గు గురించిన సంగతులు అందరి ముందు ప్రస్తావించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ముత్తు, నరసింహ, పంచతంత్రం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్ గా ఆయనంటే అందరికీ గౌరవముంది. చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్ లాంటి అగ్ర హీరోలు పిలిచి మరీ ఛాన్సులిచ్చారు. ఒక్క స్నేహం కోసం మాత్రం హిట్ అనిపించుకోగా మిగిలినవి డిజాస్టర్లుగా నిలిచాయి.
2018 టైంలో కెఎస్ రవికుమార్ కెరీర్ పరంగా బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు బాలయ్యే జై సింహ ఒప్పుకున్నారు. సంక్రాంతికి భారీ పోటీ మధ్య విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించడంలో డైరెక్షన్ తో మాస్ ఎలిమెంట్స్ కీలక పాత్ర పోషించాయి. ఆ నమ్మకమే సన్నిహితులు వద్దంటున్నా సరే మరుసటి ఏడాదే 2019లో రూలర్ ఆఫర్ ఇచ్చేలా చేసింది. తీరా చూస్తే అది ఎంత పెద్ద ఫ్లాపో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. తమిళ స్టార్ హీరోలే దూరం పెట్టిన టైంలో రవికుమార్ కి దర్శకత్వం మీద కాన్ఫిడెన్స్ చూపించింది బాలయ్య మాత్రమేనని ఫ్యాన్స్ కామెంట్. ఇది నిజమే.
మరి ఇదంతా మర్చిపోయి చాలా తేలికగా పక్క బాష అగ్ర హీరో మీద ఇలా అనడం ఖచ్చితంగా అభ్యంతరం చెప్పేదే. ఆ వీడియో క్లిప్ నిన్న సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. రవికుమార్ ప్రస్తుతం ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. అయిదేళ్ల నుంచి ఏ హీరో నుంచి పిలుపు రాలేదు. లారెన్స్ ఏదో కథకు ఓకే అన్నాడట కానీ అదింకా పట్టాలు ఎక్కలేదు. నిజంగా బాలయ్యకే కనక అంత కోపం ఉంటే ఫోన్ చేసి మరీ చెడామడా తిడతారుగా. అయినా ఇంత అనుభవమున్న సీనియర్ దర్శకులు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి కానీ మైకు ఉంది కదాని టంగ్ స్లిప్ అయితే లేనిపోని చెడ్డపేరు.
This post was last modified on March 7, 2024 12:34 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…