విశ్వక్ సేన్ హీరోగా ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండి పోస్ట్ ప్రొడక్షన్ కే సంవత్సరాల సమయం తీసుకున్న గామి విడుదల కౌంట్ డౌన్ గంటల్లోకి వచ్చేసింది. క్రమం తప్పకుండ టీమ్ చేసిన ప్రమోషన్లు ప్రేక్షకుల దృష్టిలో పడ్డాయి. ముఖ్యంగా ట్రైలర్ లో విజువల్స్ చూశాక ఆశ్చర్యపోనివారు లేరు. కమర్షియల్ అంశాలకు దూరంగా అఘోరా పాత్ర కోసం విశ్వక్ ఎంత కష్టపడింది వింటుంటే ఎంత రిస్క్ పొంచి ఉందో అర్థమవుతుంది. హిమాలయాల్లో షూట్ చేస్తున్నప్పుడు ఎదురైన ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఇంత ఎఫర్ట్ పెట్టిన గామి బృందం నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది.
గామి గెలుపుని అందరూ కోరుకుంటున్నారు. క్వాలిటీ కోసం పరితపించే క్రమంలో దర్శకుడు విద్యాధర్ పడిన శ్రమకు గుర్తింపు రావాలని ఎదురు చూస్తున్నారు. యువి సంస్థ మద్దతు దక్కడంతో డిస్ట్రిబ్యూషన్ పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి థియేటర్లు దక్కించుకోవడంలో విజయవంతమయ్యింది. ముందు రోజు ప్రీమియర్లు వేయడం లాంటి ఆలోచనలు గామి టీమ్ చేయలేదు. ప్రేక్షకులందరికీ ఒకేసారి అనుభూతి దక్కాలనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల షోలు శివరాత్రి రోజే పడనున్నాయి. సో పబ్లిక్ టాక్ చాలా కీలకం కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి.
అలా అని గామికి పోటీ లేకుండా పోలేదు. గోపిచంద్ భీమా పట్ల మాస్ వర్గాల్లో బజ్ ఉంది. తను కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇందులోనూ ఫాంటసీ టచ్ ఉంది. మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలుని మన ఆడియన్స్ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒరిజినల్ వెర్షన్ కు వచ్చిన ఫలితం ఇక్కడా రిపీట్ అయితే కొంత ఇబ్బందే కానీ మరీ ఆ స్థాయి రిజల్ట్ రావడం కొంచెం డౌట్ గానే ఉంది. మొత్తానికి గామికి దక్కే రిజల్ట్ పట్ల ఇండస్ట్రీ వర్గాలతో పాటు మూవీ లవర్స్ చూపు అధికంగా ఉంది. డివోషనల్ థ్రిల్లర్ అనే జానర్ లో కొత్త ట్రెండ్ ఏమైనా సృష్టిస్తుందేమో చూడాలి.
This post was last modified on March 7, 2024 12:45 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…