మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. సాధారణంగా సంక్రాంతి, దసరా రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర హడావిడి ఉండదు కానీ ఈసారి మాత్రం ఆసక్తికరమైన పోటీనే నెలకొంది. గామి, భీమా, ప్రేమలు దేనికవే ప్రతేకమైన అంచనాలతో థియేటర్లలో అడుగు పెడుతున్నాయి. అయితే స్టార్ హీరోల అభిమానులు ఫ్రెష్ అప్డేట్స్ కోసం పండగ ఎప్పుడు వస్తుందాని ఎదురుచూస్తున్నారు. మంచు విష్ణు కన్నప్ప నుంచి పవర్ ఫుల్ లుక్ ఒకటి వదులుతామని మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అది శివుడిగా నటిస్తున్న ప్రభాస్ దేనని డార్లింగ్ ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. కానీ ఎవరిదనేది సస్పెన్సే.
ఇంకో రెండు నెలల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 నుంచి ఏదైనా పోస్టర్ లేదా చిన్న టీజర్ ని ఎక్స్ పెక్ట్ చేయడం బాగానే ఉంది కానీ దర్శకుడు నాగ అశ్విన్ బృందం పాట షూట్ కోసం ఇటలీలో ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుందో లేదో చెప్పలేం. చిరంజీవి విశ్వంభరకు డివోషనల్ టచ్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రకటన ఏదైనా రావొచ్చనే కామెంట్ ని కొట్టిపారేయలేం. బాలకృష్ణ 109 నుంచి ఏదైనా లుక్ వస్తుందేమోనని ఫ్యాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. నాగార్జున ధనుష్ కాంబోతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా తాలూకు టీజర్ ఈ పండక్కు కన్ఫర్మ్ అయినట్టే.
ఆశిష్ – వైష్ణవి చైతన్య జంటగా రూపొందుతున్న లవ్ మీ టీజర్ రెడీ అయిపోయింది. ఇవి కాకుండా మీడియం రేంజ్ హీరోల నిర్మాతల నుంచి ఏవైనా అప్డేట్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక ఓటిటిలో హనుమాన్ రావొచ్చనే ప్రచారాన్ని జీ5 సంస్థ ఇప్పటిదాకా ధృవీకరించలేదు. వాయిదా వేశారా లేక సడన్ గా వదులుతారానేది తెలియాల్సి ఉంది. కొన్ని కొత్త సినిమాల కీలకమైన అనౌన్స్ మెంట్లు మాత్రం ఉగాది కోసం రిజర్వ్ లో ఉంచారు. ఫిబ్రవరి నుంచి డల్లుగా ఉన్న బాక్సాఫీస్ కి ఉత్సాహం తెచ్చే బాధ్యత విశ్వక్, గోపిచంద్ మీద ఉండగా ఫ్యాన్స్ కి జోష్ ఇచ్చే కొత్త కబుర్లు ఎవరిస్తారో చూడాలి.
This post was last modified on March 7, 2024 6:21 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…