Movie News

పుష్ప 2 పోటీకి సై అంటున్న హీరోలు

ఆగస్ట్ 15 పుష్ప 2 ది రూల్ విడుదల తేదీ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మైత్రి మూవీ మేకర్స్ క్రమం తప్పకుండ హింట్ వదులుతూనే ఉన్నారు. అధికారికంగా ప్రకటన గతంలోనే ఇచ్చినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంగా వాయిదా పడొచ్చేమోననే వార్తల నేపథ్యంలో ఇతర నిర్మాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీని మీద ఉన్న హైప్ కి కాంపిటీషన్ లో ఎవరు వచ్చినా ఇబ్బంది పడక తప్పదని బయ్యర్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. అయినా సరే అజయ్ దేవగన్ మల్టీస్టారర్ సింగం అగైన్ ని అదే డేట్ కి దింపాలనే లక్ష్యంతో దర్శకుడు రోహిత్ శెట్టి పని చేస్తున్నారు.

ఇంకోవైపు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఒక విదేశీ షెడ్యూల్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. అది కూడా మే లోగా అయిపోతుంది. పాటలు అక్కడే ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు పూర్తయిన భాగానికి ఆల్రెడీ చేస్తున్నారు. దీన్ని ఆగస్ట్ 15 విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు చెన్నై టాక్. విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు చేయబోయే రెండు సినిమాల్లో ఇదీ ఒకటి కావడం విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పైగా డ్యూయల్ రోల్ చేయడం ఫ్యాన్స్ ని ఎగ్జైట్ మెంట్ కి గురి చేస్తోంది.

ఈ లెక్కన పుష్ప 2కి సోలో రిలీజ్ దక్కడం అనుమానంగానే ఉంది. అయినా సరే క్రేజ్ పరంగా అల్లు అర్జున్ ని పైన ఇద్దరూ అందుకోవడం కష్టం. ఎందుకంటే అటు నార్త్ నుంచి ఇటు కేరళ దాకా బన్నీ ఫాలోయింగ్ తో పోటీ పడే స్థాయిలో అజయ్ దేవగన్, విజయ్ ఇద్దరూ లేరు. పైగా సుకుమార్ ఈసారి స్కేల్ భారీగా పెంచి మరీ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. మూడో భాగం ఉండొచ్చనే లీక్ ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. వేసవిలో ప్రమోషన్లకు శ్రీకారం చుట్టడం ద్వారా పుష్ప 2ని ఇండియా వైడ్ ఆడియన్స్ కి చేరువ చేసేందుకు ప్రత్యేకమైన పబ్లిసిటీ ప్లాన్ సిద్ధమవుతోందని సమాచారం.

This post was last modified on March 7, 2024 6:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ్వరూ నోరు తెరవొద్దు.. ‘మా’ సభ్యులతో విష్ణు

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు మంచు ఫ్యామిలీ గొడవ.. మరోవైపు సంధ్య…

17 minutes ago

రేవతి కుటుంబానికి పుష్ప టీం రూ.2 కోట్ల ఆర్థిక సాయం

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హీరో అల్లు అర్జున్ ప్రకటించిన సంగతి…

2 hours ago

ఖైదీ ఫార్ములా వాడేసిన ఈగ సుదీప్

ఉపేంద్ర యుఐ కోసం అయిదు రోజులు ఆగి విడుదలవుతున్న సినిమా మ్యాక్స్. ఈగతో మనకు విలన్ గా పరిచయమై బాహుబలి,…

2 hours ago

పెళ్ళాం డబ్బులతో బతికిన నటుడు?

తండ్రి ఒకప్పుడు నెంబర్ వన్ సూపర్ స్టార్, మరోవైపు అన్న మినిమమ్ హిట్స్ అందుకుంటున్నాడు. కానీ తమ్ముడు మాత్రం ఒకప్పుడు…

3 hours ago

సూర్యకు సరైన రూటు వేసిన సుబ్బరాజ్!

కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా కంగువ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సూర్యకి అది కోలీవుడ్…

4 hours ago

మోహన్ లాల్ మాటల్లో టాలీవుడ్ గొప్పదనం!

మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…

5 hours ago