దర్శకుడు మారుతి కొన్నేళ్లుగా ఎలాంటి క్లీన్ ఎంటర్టైనర్స్ తీస్తున్నాడో తెలిసిందే. ‘భలే భలే మగాడివోయ్’ దగ్గర్నుంచి ‘ప్రతి రోజూ పండగే’ వరకు అతను ఇంటిల్లిపాదీ కూర్చుని చూసే వినోదాత్మక చిత్రాలు తీశాడు. ఐతే కెరీర్ ఆరంభంలో తనకంటూ ఒక గుర్తింపు లేనపుడు మారుతి ఎక్కువగా బూతునే నమ్ముకున్నాడు. ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాల్లో బూతు డోస్ దట్టించడం ద్వారానే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగాడు. ఐతే ముందు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం బూతును నమ్ముకున్న మారుతి.. ఆ తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన మారుతి.. కెరీర్ ఆరంభంలో గుర్తింపు కోసం బూతును నమ్ముకోవడం ఇప్పుడెవరికీ తప్పుగా అనిపించడం లేదు.
ఐతే ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలు, తీసి.. ఎన్నో ప్రయోగాలతో ట్రెండ్ సెట్ చేసిన ఫిలిం మేకర్స్.. దీనికి భిన్నంగా ఇప్పుడు బూతు బాట పట్టి ‘చీప్’ అనిపించే సినిమాలు చేస్తుండటం విడ్డూరం.
ఈ మధ్యే ‘డర్టీ హరి’ అనే సినిమా టీజర్ ఒకటి రిలీజైంది. నిమిషం పైగా నిడివి ఉన్న ఆ టీజర్లో ప్రతి షాట్, ప్రతి డైలాగ్ వల్గర్‌గా అనిపించాయి. ఒకప్పుడు శత్రువు, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి మేటి చిత్రాలు నిర్మించిన ఎం.ఎస్.రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం గమనార్హం. ఆయనకున్న ఇమేజ్‌కు, ఇప్పుడు తీసిన సినిమాకు అసలు సంబంధమే లేదు. సక్సెస్ కోసం మరీ ఇంత దిగజారి పోవాలా అంటూ రాజును విమర్శించారు చాలామంది.
కట్ చేస్తే ఇప్పుడు విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు.. ఇప్పుడు ‘డర్టీ హరి’ని మించిన వల్గర్ సినిమాతో రెడీ అయ్యాడు. ఆయన దర్శకత్వంలో ‘క్రష్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ట్రీట్ పేరుతో ఒక లెంగ్త్ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో సన్నివేశాలు, డైలాగుల గురించి రాయడానికి కూడా కష్టమయ్యే స్థాయిలో వల్గర్‌గా ఉన్నాయి. ట్రెండ్ అని.. యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమా అని.. రవిబాబు ఏం చెప్పినా కూడా సమర్థించుకోవడానికి అవకాశమే లేదు.
బూతును చూపించి సొమ్ము చేసుకుందామనే ప్రయత్నం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అల్లరి, అనసూయ, నచ్చావులే, అవును లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రవిబాబు ఈ స్థాయికి చేరతాడని ఎవరూ అనుకోలేదు. వరుసగా ఒక్కో మేటి ఫిలిం మేకర్.. ఇలా తమ స్థాయిని తగ్గించుకుంటుండటం ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు.
This post was last modified on September 11, 2020 2:04 pm
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…
ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం..…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…