మూడేళ్ళ క్రితం వరస డిజాస్టర్లతో మార్కెట్ మీద పట్టు తగ్గిపోయిన శర్వానంద్ కు 2022లో వచ్చిన ఒకే ఒక జీవితం పెద్ద ఊరట కలిగించింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా ఎమోషన్లు, థ్రిల్స్ రెండూ మిక్స్ చేసిన తీరు ఆడియన్స్ కి నచ్చేసింది. ఆ తర్వాత అటుఇటుగా రెండేళ్లు గడిచిపోయాయి కానీ వచ్చిన ప్రతి ఆఫర్ కి శర్వా తలూపలేదు. తొందరపడితే వచ్చే నష్టం ఏంటో పడి పడి లేచే మనసు నుంచి ఆడవాళ్లు మీకు జోహార్లు దాకా ఎన్నో పాఠాలు నేర్చుకోవడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. లేట్ అయినా సరే లేటెస్టు ప్లానింగ్ తో దూసుకెళ్తున్నాడు.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఎంటర్ టైనర్ కి మనమే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ అఫీషియల్ ప్రీ లుక్ టీజర్ వదిలారు. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్. తనకూ హిట్ అవసరమైన టైంలో చేస్తున్న చిత్రమిది. హాయ్ నాన్న తరహాలో ఇందులోనూ బలమైన చైల్డ్ సెంటిమెంట్ ఉందని ఇన్ సైడ్ టాక్. లూసర్ వెబ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న అభిలాష్ రెడ్డితో యువి క్రియేషన్స్ ప్లాన్ చేసుకున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ప్రాజెక్టుని ఇవాళ అనౌన్స్ చేస్తారు. ఇది కాకుండా సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజుతో ఓ మూవీ ఉంది.
ఇది ఏకె ఎంటర్ టైన్మెంట్స్ భాగస్వామ్యంలో రానుంది. రెండేళ్లు గ్యాప్ వచ్చినా సరే ఇకపై రాకుండా శర్వానంద్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇకపై నాని లాగా కంటెంట్ ప్లస్ క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు సెలక్షన్ చూస్తే అర్థమైపోతుంది. మనమే విదేశీ షెడ్యూల్స్ వల్ల కొంత ఆలస్యమయ్యింది కానీ లేదంటే గత ఏడాది దసరాకో దీపావళికో వచ్చేది. ఇప్పుడు సమ్మర్ కు ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన రెండింటిలో ఒకటి ఈ సంవత్సరం చివర్లో వచ్చే అవకాశం లేకపోలేదు. ఇవి కాకుండా కొత్త దర్శకుడితో ఓ సినిమా టాక్స్ లో ఉంది కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.
This post was last modified on March 6, 2024 3:56 pm
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…