ఒక కథను రెండు మూడు భాగాలుగా చెప్పే ట్రెండు ఇండియన్ సినిమాలో గట్టిగానే నడుస్తోందిప్పుడు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప.. ఇలా ఈ వరుసలో చాలా సినిమాలే ఉన్నాయి. ఇందులో బాహుబలి కథ రెండు భాగాలకే ముగిసినా.. ఇంకో పార్ట్ గురించి పెద్ద చర్చ నడిచింది. కానీ తర్వాత ఆ ప్రచారానికి తెరపడింది. కేజీఎఫ్ కథ రెండు భాగాలతో ముగిసినట్లు కనిపించినా.. మూడో చాప్టర్ గురించి కూడా సంకేతాలు వచ్చాయి. భవిష్యత్తులో మూడో భాగం వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
ఇప్పుడు రెండో భాగంతో ముస్తాబవుతున్న పుష్ప సినిమాకు మూడో భాగం ఉంటుందనే ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని గురించి చాన్నాళ్ల ముందే వార్తలు మొదలయ్యాయి. ఈ మధ్యే అల్లు అర్జున్ సైతం పుష్ప-3 గురించి ప్రస్తావించాడు. ఇంకో భాగం ఉండొచ్చన్నాడు.
ఐతే ఈ మాట పట్టుకుని కొందరు ఇష్టం వచ్చినట్లు వార్తలు అల్లేస్తున్నారు. పుష్ప-3కి కథ రెడీ అయిపోయిందని.. ఆల్రెడీ మూడో పార్ట్ కోసం కొన్ని సీన్లు కూడా తీశారని.. 2025 వేసవిలో పుష్ప-3 రలీజ్ ఉంటుందని.. ఇలా ప్రచారం చేసేస్తున్నారు. ఐతే ఈ వార్తలు చూసి పుష్ప టీం సభ్యులు నవ్వుకుంటున్నారట. పుష్ప-2నే అనుకున్న టైంకి రావట్లేదు. వాయిదాల మీద వాయిదాలు పడి.. చివరికి ఈ ఆగస్టు 15కు షెడ్యూల్ అయింది. కానీ అప్పుడైనా సినిమా వస్తుందా రాదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. షూటింగ్ షెడ్యూళ్లు ఆలస్యం అవుతున్నాయి. అనుకున్న ప్రకారం షూట్ పూర్తి చేసి ఆగస్టు 15న రిలీజ్ చేయడమే సవాలుగా మారింది.
సుక్కు తన మార్కు పర్ఫెక్షనిజంతో యూనిట్ సభ్యులకు, నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నాడట. పుష్ప-2 సంగతే ఇలా ఉంటే.. అప్పుడే పుష్ప-3 పనులు మొదలుపెట్టి, రిలీజ్ ప్లాన్ చేయడం అంటే టీం సభ్యులకు నవ్వు రాకుండా ఎలా ఉంటుంది?
This post was last modified on March 6, 2024 3:50 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…