నందమూరి బాలకృష్ణకు బయట ఎక్కడైనా కోపం వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అభిమానుల మధ్యకు వచ్చినపుడు.. షూటింగ్ స్పాట్లో ఆయనకు ఎవరైనా కోపం తెప్పిస్తే ముందు వెనుక ఆలోచించకుండా చేయి చేసుకుంటారు. దీనికి సంబంధించి చాలా వీడియోలో సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.
గతంలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై సింహా’ చిత్రీకరణ సందర్భంగా ఒక అసిస్టెంట్ మీద బాలయ్య చేయి చేసుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇప్పుడు కేఎస్ రవికుమార్ చెన్నైలో జరిగిన ఒక వేడుకలో బాలయ్య కోపం గురించి మాట్లాడారు.
తన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవ్వరైనా నవ్వితే చాలు బాలయ్యకు కోపం వచ్చేస్తుందని.. కొట్టేస్తాడని రవికుమార్ చెప్పడం గమనార్హం. బాలయ్యతో రవికుమార్ ‘జైసింహా’తో పాటు ‘రూలర్’ అనే ఇంకో సినిమా కూడా చేశాడు. అప్పటి అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘షూటింగ్‌లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే ఆయన ఊరుకోడు. తనని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడు. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి మరీ కొడతాడు. ఓ సినిమా షూటింగ్ టైంలో నా అసిస్టెంట్ శరవణన్‌ను ఫ్యాన్ తీసుకురావాలని ఆయన చెప్పాడు. అతను అనుకోకుండా ఫ్యాన్ బాలయ్య వైపు తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది.
దీంతో శరవణన్ కొంచెం నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడు. ఆయన కోపం గురించి నాకు తెలిసిందే కాబట్టి ఎక్కడ శరవణన్‌ను కొట్టేస్తాడో అనిపించి.. అతను మన అసిస్టెంటే అని చెప్పాను. అయినా ఆయన కూల్ అవ్వలేదు. నేను వెంటనే శరవణన్‌ను గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోమన్నాను. అప్పుడు బాలకృష్ణ కొంచెం స్థిమితపడ్డాడు’’ అని రవికుమార్ ఆ ఉదంతం గురించి గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on March 6, 2024 3:44 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…