తెలుగు నాట మరే కన్నడ నటుడికీ లేని ఫాలోయింగ్ ఉపేంద్రకు ఉంది. 2000వ సంవత్సరానికి అటు ఇటు తెలుగులో విడుదలైన అతడి సినిమాలు సంచలనం రేపాయి. ఉపేంద్ర, రా లాంటి చిత్రాలు అతడికి మాంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ఇక్కడ అతణ్ని ఒక స్టార్ లాగా చూశారు. ఈ ఊపులో నేరుగా తెలుగులో కొన్ని సినిమాలు కూడా చేశాడు ఉప్పి. చాలా గ్యాప్ తర్వాత అతను స్వీయ దర్శకత్వంలో నటించిన ‘సూపర్’ సినిమా కూడా ఇక్కడ బాగానే ఆడింది.
ఐతే నటుడిగా మాత్రం తెలుగులో చాన్నాళ్లు కనిపించని ఉపేంద్ర.. ఆ మధ్య అల్లు అర్జున్-త్రివిక్రమ్‌ల ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో నెగెటివ్ టచ్ ఉన్న కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో ఉపేంద్ర మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఐతే యువ కథానాయకుడు వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రంలో ఉప్పి ఓ కీలక పాత్ర చేయనున్నట్లు ఇంతకుముందు ఊహాగానాలు వినిపించాయి.
ఈ విషయంపై ఉపేంద్ర స్పందించాడు. తాను వరుణ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధ్రువీకరించాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత తెలుగులో నటించకపోవడానికి అందరూ విలన్ పాత్రలే ఆఫర్ చేయడమే కారణమన్నాడు. అలాంటి పాత్రలు తాను చేయాలా అని ఆలోచనలో పడ్డానన్నాడు. సరైన స్క్రిప్టు, పాత్ర కోసం ఎదురు చూస్తున్ తనకు వరుణ్ సినిమాలో క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నట్లు చెప్పాడు.
ఉప్పి మాటల్ని బట్టి చూస్తే అది విలన్ రోల్ కాదని అర్థమవుతోంది. ఇదిలా ఉండగా.. ఉపేంద్ర హీరోగా ‘కబ్జా’ పేరుతో ప్రస్తుతం ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఇంతకుముందు అతడితో రెండు సినిమాలు తీసిన చంద్రు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ, తెలుగుతో పాటు ఏడు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. ఇటీవలే రిలీజ్ చేసిన ‘కబ్జా’ ఫస్ట్ లుక్‌లో ఉపేంద్ర సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు.
This post was last modified on April 27, 2020 10:13 am
విశాఖపట్నం ఐటీ మ్యాప్‌పై మరింత బలంగా నిలవడానికి మరో భారీ అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్ హిల్–2లోని మహతి…
వైసీపీ నాయకుడు, వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దువ్వాడ మాధురిని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం…
ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు.…
మూడు నెలల కాలంలో అద్భుత విజయాలను సాధించాలని టిడిపి అధినేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి…
కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…