వీలైనంత రొటీన్ ఫార్ములా జోలికి వెళ్లకుండా ఏదో కొత్తగా ట్రై చేస్తూ వస్తున్న విశ్వక్ సేన్ కు ఫలితాలు అంతే గొప్పగా రాకపోయినా ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. తొమ్మిదేళ్లకు పైగా ఒక సినిమాకు వర్క్ జరగడం చిన్న విషయం కాదు. అందుకే హఠాత్తుగా వస్తున్నట్టు అనిపిస్తున్నా గామి మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. అఘోరాగా చాలా డెప్త్ ఉన్న పాత్రను ఇందులో చేసిన సంగతి తెలిసిందే. సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ రావడంతో కంటెంట్ ఏ రేంజ్ షాకింగ్ గా ఉంటుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దీన్ని కాసేపు పక్కనపెట్టి కొత్త ముచ్చట ఒకటి చూద్దాం.
విశ్వక్ తర్వాత చేయబోయే సినిమాల్లో లైలా ఒకటి. ఇందులో సెకండ్ హాఫ్ మొత్తం అమ్మాయిగా కనిపించబోతున్నాడు. ఇది స్వయంగా తనే ఇంటర్వ్యూలలో చెప్పేస్తున్నాడు. గెటప్ మాత్రమే లేడీగా ఉంటుందా లేక ఏదైనా ట్విస్టు జరిగి అలా మారిపోతాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నిజానికి ఇది పెద్ద రిస్క్. స్టార్ హీరోలు సైతం గతంలో పాటకో లేదా ఒక సీన్ కో ఆడవేషం వేసుకున్నారు కానీ లెన్త్ ఎక్కువ ఉన్న వాటిని ట్రై చేయలేదు. కామెడీ స్టార్లలో రాజేంద్ర ప్రసాద్ మేడమ్, నరేష్ చిత్రం భళారే విచిత్రం ఈ జానర్ లో ల్యాండ్ మార్క్ మూవీస్ గా నిలిచిపోయాయి. ఇంత నిడివితో తర్వాత ఎవరూ చేయలేదు.
అయినా సరే విశ్వక్ మాత్రం లైలా పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని, ఊహించని విధంగా కథా కథనాలు ఉంటాయని ఊరిస్తున్నాడు. చూస్తుంటే ఇమేజ్ లెక్కలు గట్రా వేసుకోకుండా స్టోరీనే ముఖ్యమని ఫిక్సయినట్టు ఉన్నాడు. దాస్ కా ధమ్కీ, ఫలక్ నుమా దాస్ లకు సీక్వెల్స్ తో పాటు ఈ రెండింటిని కలుపుతూ ఇంకో పార్ట్ తీస్తానని అంటున్నాడు. సబ్జెక్టు నచ్చితే రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా వెళ్లిపోతున్న విశ్వక్ సేన్ ఇంకో నెలన్నర లోపే గ్యాంగ్ అఫ్ గోదావరితో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ రెండూ హిట్ కావడం చాలా కీలకం.
This post was last modified on March 6, 2024 3:43 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…