Movie News

భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌పై మౌనం వీడిన జ‌య‌సుధ‌


సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ భ‌ర్త నితిన్ క‌పూర్ కొన్నేళ్ల కింద‌ట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం సంచ‌ల‌నం రేపింది. జ‌య‌సుధ‌తో ఆయ‌న‌ది అన్యోన్య వివాహ బంధమే. వీళ్లిద్ద‌రికీ ఇద్ద‌రు కొడుకులున్నారు. జ‌య‌సుధ సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్లోనూ త‌న‌వంతు పాత్ర పోషించారు. నితిన్ జ‌య‌సుధ‌తో సినిమాలు తీయ‌డ‌మే కాక కొన్ని వ్యాపారాలు చేస్తుండేవాడు. ఆయ‌న‌కు ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు కూడా ఏమీ వార్త‌లు రాలేదు. మ‌రి నితిన్ ఎందుకు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డాల్సి వ‌చ్చిందో అప్పుడు అర్థం కాలేదు. కొంద‌రు ఈ విష‌యంలో జ‌య‌సుధ మీద నింద‌లు వేశారు. భ‌ర్త చ‌నిపోయిన‌పుడు బాధ‌లో ఉన్న‌ జ‌య‌సుధ దాని గురించి పెద్ద‌గా మాట్లాడ‌లేదు. ఐతే ఇప్పుడు నితిన్ ఆత్మ‌హ‌త్య గురించి ఆమె స్పందించింది.

సినిమా వాళ్ల గురించి అంద‌రూ ఏది ప‌డితే అది రాసేస్తుంటారు. నిజా నిజాలు తెలుసుకోరు. మా ఆయ‌న‌కు అప్పులున్నట్లు కొంద‌రు అప్ప‌ట్లో రాశారు. కానీ ఆయ‌న‌కు ఎలాంటి ఆర్థిక స‌మ‌స్య‌లు లేవు. నితిన్ సోద‌రుడు, మా కుటుంబంలో ఇంకో ఇద్ద‌రు కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఏదో ఒక‌రోజు నితిన్ కూడా ఈ ప‌ని చేస్తాడ‌ని మాకు భ‌యం ఉండేది. నేను, మా అత్త‌గారు అది జ‌ర‌గ‌కుండా ఆపాల‌ని ఎంతో ప్ర‌య‌త్నించాం. కానీ మా వల్ల కాలేదు. మా ఫ్యామిలీలో ఇంకెవ‌రికీ ఇలా జ‌ర‌గ‌కూడ‌ద‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాం.

నితిన్ మ‌ర‌ణానంత‌రం ఆ బాధ నుంచి కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. కుటుంబ అండ‌తోనే దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ్డా అని జ‌య‌సుధ చెప్పింది. జ‌యసుధ చిన్న‌కొడుకు నిహార్ క‌పూర్.. రికార్డ్ బ్రేక్ అనే సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్య‌లు చేసింది.

This post was last modified on March 6, 2024 1:33 pm

Share

Recent Posts

నువ్వా ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడేది

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు క‌నీస వ‌స‌తులు కూడా ఇవ్వ‌కుండా వారి…

23 minutes ago

ఏం చేస్తే పవన్ సహించరో అదే చేశారు

పల్లె పండుగ కార్య‌క్ర‌మం కింద క‌ష్ట‌ప‌డి నిధులు తీసుకువ‌చ్చి రోడ్డు నిర్మించామ‌ని.. అయితే.. వ్య‌క్తిగ‌త అక్క‌సుతో ర‌హ‌దారిని ధ్వంసం చేసేశార‌ని…

36 minutes ago

ఎక్క‌డ అన్యాయం జ‌రిగింది జ‌గ‌న్‌

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌మ వారిని నామినేష‌న్లు కూడా వేయ‌కుండా అడ్డుకున్నార‌ని.. అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టించార‌ని ఆరోపిస్తూ.. గ‌గ్గోలు పెట్టిన…

51 minutes ago

విశ్వక్ సేన్ రూటు మార్చడం రైటేనా

వరుస ఫ్లాపులు రావడం వల్లే రూటు మార్చి, మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి కల్ట్ తీశానని చెబుతున్న విశ్వక్ సేన్,…

56 minutes ago

టైగర్ కు బుల్లెట్ గాయాలు తగిలాయా?

నిన్న రాత్రి నుంచి బాలీవుడ్ గజగజ వణికిపోతోంది. కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ తారలకు డెత్ థ్రెట్స్ ఇస్తూ వస్తున్న లారెన్స్…

2 hours ago

లైలా ఎందుకు తీశావ్ విశ్వక్ అన్నా

ప్రతి హీరో కెరీర్లో ఫ్లాపులు ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆ పేర్లు తలుచుకోవడానికి కూడా భయపడే రేంజిలో…

3 hours ago