నందమూరి కుటుంబం నుంచి చాలా ఏళ్ల కిందటే చైతన్యకృష్ణ ఓ వారసుడు వచ్చిన విషయం అందరూ మరిచిపోయిన సమయంలో ఈ మధ్యే అతను హీరోగా ‘బ్రీత్’ అనే సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్ తనయుల్లో ఒకరైన జయకృష్ణ కొడుకే ఈ చైతన్య కృష్ణ. అతను 2003లో జగపతిబాబు హీరోగా తెరకెక్కిన ‘ధమ్’ అనే సినిమాలో ఒక క్యారెక్టర్ రోల్ చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చైతన్యకృష్ణ జనాల దృష్టిలో పడలేదు.
ఐతే ‘ధమ్’ తర్వాత సినిమాల్లో కనిపించని చైతన్య.. గత ఏడాది ‘బ్రీత్’ సినిమాలో నటించాడు. దానికి నిర్మాత అతడి తండ్రే. వంశీకృష్ణ ఆకెళ్ల రూపొందించిన ఈ చిత్రం విడుదలైన సంగతి కూడా జనాలకు తెలియలేదు. ఐతే ఈ సినిమా సౌండ్ చేయకపోయినా.. దీని ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో, వేరే వేదికల్లో చైతన్యకృష్ణ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ట్రోలర్లకు కావాల్సిన సరంజామా అతను బాగానే ఇచ్చాడు.
దీంతో సోషల్ మీడియాలో చైతన్యకృష్ణ మీద ట్రోల్ పేజీలు పెట్టి మరీ అతణ్ని ఆటాడుకుంటున్నారు జనాలు. ఎవరికీ పట్టని ‘ధమ్’ సినిమాలో చైతన్యకృష్ణ ఎక్స్‌ప్రెషన్లు, డైలాగులు, డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు పట్టుకొచ్చి అతణ్ని ట్రోల్ చేస్తున్నారు. అంతే కాక బ్రీత్ సినిమాకు ప్రమోషనల్ వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు.
ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన దగ్గర్నుంచి ఓటీటీ రిలీజ్ కోసం ట్రోలర్స్ డిమాండ్ చేస్తుండడం గమనార్హం. వారి పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మార్చి 8న ఆహా ఓటీటీలో ‘బ్రీత్’ స్ట్రీమ్ కానుంది. దీంతో ట్రోలర్స్ ఆల్రెడీ సంబరాలు మొదలుపెట్టేశారు. బ్రీత్ డిజిటల్ రిలీజ్ తర్వాత మరింతగా చైతన్యను ట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నది వారి అభిప్రాయం. ఐతే చైతన్య కూడా ఇలాంటి ట్రోలింగ్‌కు బాగా అలవాటు పడిపోయినట్లున్నాడు. ట్రోలింగ్ గురించి అతను చాలా స్పోర్టివ్‌గానే మాట్లాడాడు కొన్ని ఇంటర్వ్యూల్లో.
This post was last modified on March 5, 2024 2:28 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…