శుక్రవారం విడుదల కాబోతున్న గామికి సెన్సార్ A సర్టిఫికెట్ ఇచ్చింది. పెద్దలకు మాత్రమే ట్యాగ్ రావడంతో 18 ఏళ్ళు నిండిన వారికి మాత్రమే ప్రదర్శించాలని క్లారిటీ వచ్చేసింది . అంటే పిల్లలతో కలిసి ఫ్యామిలీ చూసే కంటెంట్ కాదని అర్థమైపోయిందిగా. మల్టీప్లెక్సుల్లో గత కొంత కాలంగా ఈ నిబంధనను కఠినంగా పాటిస్తున్నారు. సలార్ కు ఇదే సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ లో పలు థియేటర్లలో సిబ్బందితో వాగ్వాదం చేసిన ప్రేక్షకులున్నారు. ప్రభాస్ మూవీ కాబట్టి కుటుంబ సమేతంగా రావొచ్చనే అభిప్రాయం వల్ల కలిగిన ఇబ్బందిది. ఓటిటిలో ఎవరూ ఆపలేదు అది వేరే సంగతి.
గామికి ఏ రావడం చూస్తే కంటెంట్ లో యాక్షన్, వయొలెన్స్ తో పాటు రా ఎపిసోడ్స్ చాలా ఉన్నట్టు అనిపిస్తోంది. అఘోరాగా విశ్వక్ సేన్ నటించిన ఈ స్పిరిచువల్ థ్రిల్లర్ లో సహజత్వం కోసం చూపించిన కొన్ని సన్నివేశాలు పిల్లలను భయపెట్టేలా ఉండొచ్చని సెన్సార్ టీమ్ అభిప్రాయ పడిందట. హిమాలయాల్లో జరిగే ఎపిసోడ్స్ లో ఇవి ఎక్కువగా ఉంటయని సమాచారం. సో అడల్ట్స్ ఓన్లీ అని చెప్పేశారు కాబట్టి దానికి అనుగుణంగా ముందే ప్రిపేర్ అయితే బెటర్. గోపీచంద్ భీమా, మలయాళం డబ్బింగ్ ప్రేమలుతో పోటీ పడుతున్న గామికి ఈ ఒక్క A అంశం ఇబ్బంది పెట్టే విషయమే.
అయిదేళ్లకు పైగా నిర్మాణం జరుపుకున్న గామికి యువి క్రియేషన్స్ అండ దక్కడంతో రిలీజ్ పరంగా మంచి థియేటర్లు దక్కుతున్నాయి. విజువల్ ఎక్స్ పీరియన్స్ బాగుండే స్క్రీన్లలో చూస్తేనే నిజమైన అనుభూతి దక్కుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే ప్లాన్ చేస్తున్నారట. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా ట్రైలర్ రూపంలో ఆసక్తి రేపడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇంత క్వాలిటీ విఎఫెక్స్ తో తెరకెక్కించి ఇంతకాలం సైలెంట్ గా ఉండటమే మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరిచింది. తెలుగులో ఎవరూ టచ్ చేయని పాయింట కనక కనెక్ట్ అయితే హిట్టు పడ్డట్టే.
This post was last modified on March 5, 2024 2:28 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…