మంజుమ్మెల్ బాయ్స్.. ఇప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న చిత్రం. ఇందులో ఒకరిద్దరు మినహా పేరున్న ఆర్టిస్టులు లేరు. దర్శకుడికి ఇది రెండో చిత్రం మాత్రమే. పరిమిత బడ్జెట్లో తీసిన సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మామూలు సంచలనం రేపట్లేదు. గత నెల 22న విడుదలై అదిరిపోయే టాక్ తెచ్చుకున్న ఈ సర్వైవల్ థ్రిల్లర్.. రిలీజై రెండు వారాలు కావస్తున్నా హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది.
కేరళలో ప్రతి థియేటర్లో ప్రతి షోకూ హౌస్ ఫుల్ బోర్డు పడిపోతోంది. వరల్డ్ వైడ్ సినిమా ఆడుతున్న ప్రతి చోటా మంచి వసూళ్లు వస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో సైతం ఆడుతున్న షోలన్నీ మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తున్నాయి. తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇప్పటికే అక్కడ పది కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘లాల్ సలాం’ గత నెలలో విడుదలై తమిళనాట 18 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా.. దాన్ని ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే చిన్న సినిమా దాటేయబోతోందని ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. విదేశాల్లో ఈ చిత్రం రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.80 కోట్లకు చేరువగా ఉన్నాయి. వంద కోట్ల మార్కును అందుకోవడం లాంఛనమే. ఈ సినిమా స్థాయికి ఈ వసూళ్లు అనూహ్యం.
ఇది తమిళనాట జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడం విశేషం. కొన్నేళ్ల కిందట కేరళ నుంచి కొందరు యువకుల బృందం.. కోడైకెనాల్ ట్రిప్ వేసింది. అప్పుడు ఆ గ్రూప్‌లోని ఒకరు గుహలో చిక్కుకుపోయాడు. అతణ్ని అక్కడి నుంచి బయటికి తేవడానికి మిత్ర బృందం ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సినిమాను తీర్చిదిద్దడంతో ప్రేక్షకులకు మాంచి థ్రిల్ ఇస్తోంది. మంజుమ్మెల్ బాయ్స్‌ను తెలుగులో కూడా త్వరలోనే విడుదల చేయాలని చూస్తున్నారు.
This post was last modified on March 4, 2024 5:46 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…