ఒకప్పడు హీరోగా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించుకున్న గోపిచంద్ కు టైం కొంత కాలంగా టైం కలిసి రావడం లేదు. గత అయిదేళ్లలో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి లేకపోవడం ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానుల ఆశలన్నీ భీమా మీద ఉన్నాయి. తెలుగోళ్లతో వర్కౌట్ కావడం లేదని గుర్తించిన మాచో స్టార్ ఈసారి కన్నడ దర్శకుడు హర్షని నమ్ముకున్నాడు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ మూవీస్ బాగా తీస్తాడని పేరున్న హర్షకు శాండల్ వుడ్ లో శివరాజ్ కుమార్ లాంటి స్టార్ల మద్దతు బలంగా ఉంది. తన టాలెంట్ టాలీవుడ్ లో చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
మార్కెట్ లెక్కలు ఎలా ఉన్నా భీమా ఖచ్చితంగా హిట్టవ్వాల్సిన అవసరం చాలా ఉంది. థియేట్రికల్ బిజినెస్ కనీసం పాతిక కోట్లు చేయాల్సిన చోట దానికి కన్నా ఓ పది కోట్లు తగ్గించుకుని రాజీ పడాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నిరాశ పరచనని, నమ్మకం ఉంది కాబట్టే దేనికీ చెప్పనంత గొప్పగా భీమా గురించి ప్రమోట్ చేస్తున్నానని గోపిచంద్ అంటున్నాడు. బాక్సాఫీస్ వద్ద మార్చి 8న విశ్వక్ సేన్ గామితో పాటు మలయాళం సెన్సేషనల్ హిట్ ప్రేమలుతో పోటీ ఉంది. వీటిని తక్కువంచనా వేయడానికి లేదు. పబ్లిక్ టాక్స్ ఈ మూడింటికి కీలకం కాబోతున్నాయి.
భీమా కనక బ్లాక్ బస్టర్ అయితే గోపిచంద్ ఇమేజ్ మళ్ళీ పుంజుకుంటుంది. టాలెంట్, మాస్ ఇమేజ్ ఎంత పుష్కలంగా ఉన్నా దాన్ని సరిగ్గా వాడుకునే దర్శకులు తనకు దొరకడం లేదు. ఎంతసేపూ ఓవర్ మాస్ గా ప్రొజెక్టు చేసి చేతులు కాలేలా చేసినవాళ్ళే అందరూ. ఈసారి మాత్రం భీమా విషయంలో గోపిచంద్ చాలా ధీమాగా ఉన్నాడు. పక్కా కమర్షియల్, రామబాణం చేసిన గాయాల నుంచి కోలుకోవాలంటే ఇది బలమైన ముందుగా పని చేయాలి. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న భీమాలో గోపిచంద్ వేరియేషన్స్ స్క్రీన్ మీద షాకింగ్ గా ఉంటాయట. ఈ శుక్రవారం రిజల్ట్ వచ్చేస్తుంది.
This post was last modified on March 4, 2024 11:00 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…