ఆపరేషన్ వాలెంటైన్ తో పాటు నిన్న విడుదలైన సినిమాల్లో బజ్ తక్కువగా ఉన్నా కాసింత ఆసక్తి రేపిన వాటిలో భూతద్దం భాస్కర్ నారాయణ ఒకటి. హీరోగా సెటిలయ్యేందుకు కష్టపడుతున్న శివ కందుకూరి కథానాయకుడిగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు. అనూహ్యంగా దీనికే కొంత డీసెంట్ టాక్ వినిపించడం గమనార్హం. ముందు రోజు రాత్రి హైదరాబాద్ లో వేసిన ప్రీమియర్లతో పాటు రిలీజ్ రోజు మెల్లగా పెరుగుతున్న ఆక్యుపెన్సీలు చిన్నగా ఆశలు పెంచుతున్నాయి. ఇంతకీ భాస్కర్ ఏం చేశాడో చూద్దాం.
ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గ్రామంలో దిష్టిబొమ్మ హత్యలు అంతు చిక్కని మిస్టరీగా మారతాయి . 18 ఏళ్లలో పదిహేను స్త్రీలను చంపేసినా హంతకుడు ఎవరో కనుక్కోలేక పోలీసులు సతమతమవుతూ ఉంటారు. అప్పుడు రంగంలోకి దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఎలాగైనా గొప్ప పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్న ఈ సరదా గూఢచారి మెల్లగా కూపీలు లాగుతూ అవి మర్డర్లు కాదని, నరబలులని గుర్తిస్తాడు. అయితే చేసిందెవరో అర్థం కాదు. చివరికి ఇలాంటి సస్పెన్స్ డ్రామాల్లోలాగే ఇక్కడా ఎవరూ ఊహించని వ్యక్తి విలన్ గా తేలతాడు.
క్రైమ్ కథలు మనకు కొత్త కాకపోయినా మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్ తీసుకున్న పురుషోత్తం రాజ్ దాన్ని కాస్త విభిన్నంగా అందించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ పాత్రల పరిచయాలు, హత్యల నేపధ్యం ఇలా ఏదోలా టైం పాస్ చేయించి అసలు ట్విస్టులు సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు. మధ్యలో అవసరం లేని ఉపకథలు, డ్రామాలు వచ్చి ఇబ్బంది పెడతాయి. విలన్ ని రివీల్ చేసే విధానం, దానికి ఎంచుకున్న ఆర్టిస్టు చిన్న షాకే. బిగిసడలని కథనం అవసరమైన ఇలాంటి సినిమాలో అది పూర్తి స్థాయిలో లేకపోవడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. వీకెండ్ లో ఏదోకటి చూడాల్సిందే అంటేనే ఛాయస్ గా పెట్టుకోవచ్చు.
This post was last modified on March 2, 2024 7:18 pm
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…