Movie News

ప్రమాదాలుగా మారుతున్న వరుణ్ ప్రయోగాలు

గంపెడాశలతో దేశం మొత్తం ప్రమోషన్ చేసిన వరుణ్ తేజ్ కు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫలితం ఎంత మాత్రం సంతోషం కలిగించే దిశగా వెళ్లడం లేదు. ఓపెనింగ్స్ లోనే ఈ విషయం తేటతెల్లమైపోగా పబ్లిక్ టాక్, రివ్యూలు ఆశాజనకంగా లేకపోవడంతో హిందీ, తెలుగు రెండు చోట్ల ప్రయాణం భారంగా జరగనుంది. నిజానికీ మెగా హీరో కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా కొత్త తరహా ప్రయోగాలు చేద్దామని ప్రమాదాల బారిన పడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల మార్కెట్ డౌన్ కావడమే కాకుండా క్రమంగా మాస్ కి దూరమయ్యే రిస్క్ ఏర్పడుతుంది. ఇది డేంజర్ బెల్ లాంటిది.

గత ఏడాది ‘గాండీవధారి అర్జున’కూ ఇలాగే జరగడం ఫ్యాన్స్ మర్చిపోలేదు. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా అందులోనూ టిపికల్ పాత్ర చేసినా ప్రయోజనం దక్కలేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమా మొత్తం విదేశాల్లో చుట్టేయడం స్వదేశంలో తిరస్కారానికి దారి తీసింది. అంతకు అంతకుముందు ‘గని’లో లక్ష్యం కోసం కష్టపడే బాక్సర్ గా చేసిన క్యారెక్టర్ దారుణమైన డిజాస్టర్ ని చేతిలో పెట్టింది. ఉపేంద్ర లాంటి సీనియర్ హీరో స్పెషల్ రోల్ సైతం ఉపయోగపడలేదు. దీని దెబ్బ ఎంత గట్టిదంటే స్వంతంగా ప్రొడక్షన్ మొదలుపెట్టిన అల్లు అర్జున్ అన్నయ్య బాబీ తిరిగి ఇంకో సినిమా చేయలేనంతగా.

ఇవన్నీ వరుణ్ తేజ్ విశ్లేషించుకోవాలి. ఎఫ్2, ఎఫ్3, ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ ఎందుకు సక్సెస్ అయ్యాయో గుర్తించాలి. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అవి ఇవ్వాలి తప్పించి తాను పర్సనల్ గా ఇష్టపడినవి చేసుకుంటూ పోవడం కాదు. రవితేజ లాంటి స్టార్లు ఎక్స్ పరిమెంట్లు చేయొచ్చు. కెరీర్ ఉచ్చ దశ ఎప్పుడో చూశారు కానీ ఇప్పుడొచ్చే ఫలితాలు పెద్దగా ప్రభావం చూపించవు. కానీ వరుణ్ కేసు అది కాదు. ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. చాలా భవిష్యత్తు ఉంది. మెగా ప్రిన్స్ అనడమే తప్పించి ఇంకా స్టార్ ట్యాగే రాలేదు. అలాంటప్పుడు ఇకపై వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి.

This post was last modified on March 2, 2024 7:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూలీ మొదలెట్టాడు…వార్ 2 ఇంకా ఆలస్యమా

ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…

2 hours ago

రేపటి నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ

ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…

2 hours ago

అసలేం జరుగుతుంది? బాబు సీరియస్

కూట‌మి ప్ర‌భుత్వంలో నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం.. అంతా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంది. ఇది…

4 hours ago

రూ.1000 పెంచిన బాబుకు మంచి మార్కులు

ప్ర‌తి నెలా 1వ తేదీన ఠంచ‌నుగా అందుతున్న ఎన్టీఆర్ భ‌రోసా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను ప్ర‌భుత్వానికి మంచి మార్కులే వేస్తోంది.…

5 hours ago

Don’t Miss: క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం రాత్రి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తంగా భావిస్తున్న…

6 hours ago

రెండు అడుగుల్లో ‘OG’ మోక్షం… పవన్ సంకల్పం!

హరిహర వీరమల్లు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయడంతో ఇప్పుడు అభిమానుల చూపు ఓజి వైపు వెళ్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు…

7 hours ago