నిన్న విడుదలైన సినిమాల్లో చెప్పుకోదగ్గ బజ్ ఆపరేషన్ వాలెంటైన్ పైన ఉంది కానీ వెన్నెల కిషోర్ హీరోగా నటించిన చారి 111ని ఓసారి ట్రై చేద్దామని ఎదురు చూసిన ప్రేక్షకులు లేకపోలేదు. టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఎవరూ అంతగా టచ్ చేయని స్పై కామెడీ జానర్ ని దర్శకుడు టిజి కీర్తి కుమార్ కథగా మలుచుకున్నారు. ట్రైలర్ గట్రా కాసింత ఆసక్తిని రేపాయి కానీ ఓపెనింగ్స్ మాత్రం డల్ గా మొదలుపెట్టిన చారి పూర్తిగా టాక్ ని నమ్ముకుని రంగంలోకి దిగాడు. బాక్సాఫీస్ కి కాసింత ఎంటర్ టైన్మెంట్ తో చారి ఏమైనా ఊపు తీసుకొస్తాడేమోనని ఆశపడిన బయ్యర్లు లేకపోలేదు. ఇంతకీ గూఢచారి నవ్వించాడా లేదా.
రాష్ట్ర ముఖమంత్రి అండదండలు ఉన్న రుద్రనేత్ర సీక్రెట్ ఏజెన్సీకి హెడ్డు మేజర్ ప్రసాదరావు(మురళి శర్మ). హైదరాబాద్ లో జరిగిన ఒక ఆత్మహుతి దాడి కేసుని ఛేదించే బాధ్యత ఈ టీమ్ మీద పడుతుంది. బృందంలో పని చేసే ఏజెంట్ చారి 111(వెన్నెల కిషోర్)కి ఈ మిషన్ అప్పగిస్తాడు ప్రసాదరావు. దీని వెనుక పెద్దమనుషుల హస్తం ఉందని గుర్తించి వాళ్ళను ఫాలో కావడం మొదలుపెడతాడు చారి. చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఫైనల్ గా కుట్ర చేసిన తీవ్రవాదులు ఎవరు, ఏజెంట్ ఈషా(సంయుక్త)కున్న సంబంధం ఏంటి లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.
ఎంత హాస్యనటుడిని హీరోగా పెట్టి తీసినా ఇలాంటి సీరియస్ పాయింట్ ని ఎంచుకున్నప్పుడు ఓవర్ ది బోర్డ్ వెళ్లకూడదు. కానీ దర్శకుడు కీర్తి కుమార్ ఈ ప్రాధమిక సూత్రాన్ని పూర్తిగా విస్మరించి అర్థం లేని కామెడీతో చిత్ర విచిత్రమైన నరేషన్ తో విసిగిస్తాడు. ఎంత లాజిక్స్ పట్టించుకోకూడదని అనుకున్న తీసుకున్న పాయింట్ టెర్రరిజంకి సంబంధించినది కావడంతో చారి చేసే పనులు, విన్యాసాలు నవ్వించకపోగా చాలా అతి అనిపిస్తాయి. పాత్రల తీరుతెన్నులు ఒక క్రమపద్ధతిలో ఉండవు. వెన్నెల కిషోర్ ఒక దశ దశ దాటాక చేతులు ఎత్తేశాడు. భరించడం ఎంతో కష్టమనిపించేలా భయపెట్టాడు చారి.
This post was last modified on March 2, 2024 10:45 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…