తొలి సినిమా ‘ముకుంద’ నుంచి తరచుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. ఐతే కొన్నిసార్లు మంచి ఫలితాలు వచ్చాయి. కొన్నిసార్లు తేడా కొట్టాయి. ఈ మధ్య అతడికి అస్సలు కలిసి రావడం లేదు. రెండేళ్ల కిందట వచ్చిన ‘ఎఫ్-3’.. ఆపై ‘గని’, ‘గాండీవధారి అర్జున’ నిరాశపరిచాయి. చివరి రెండు సినిమాలైతే మరీ ఘోరమైన ఫలితాలు అందుకున్నాయి.
ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మీదే ఉన్నాయి. ఇది వరుణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా. ఈ చిత్రంతోనే అతను హిందీలో అడుగు పెడుతున్నాడు. వరుణ్ ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రమిది. ఆ కష్టానికి ఎలాంటి ఫలితం వస్తుందో శుక్రవారమే తేలిపోతుంది. ఈ చిత్రం సక్సెస్ కావడం వరుణ్‌కు చాలా చాలా అవసరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వరుణ్ గత సినిమాల ప్రభావం ‘ఆపరేషన్ వాలెంటైన్’ మీద పడి విడుదల ముంగిట ఆశించిన స్థాయిలో బజ్ లేదు. దీనికి తోడు బాలీవుడ్ మూవీ ‘ఫైటర్’తో పోలికలు సమస్యగా మారాయి. కానీ టీజర్, ట్రైలర్ చూస్తే ఇది కంటెంట్ ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది. టీం ఎంతో కష్టపడి తీసిన విషయం అర్థమవుతోంది. కథాంశం విషయంలో ‘ఫైటర్’తో పోలికలు ఉన్నా.. అక్కడ తేడా కొట్టిన మిషన్ ఇక్కడ సక్సెస్ అవదని చెప్పలేం. కంటెంట్ ఉండాలే కానీ.. ఒకే కథను మళ్లీ మళ్లీ తీసినా జనం చూస్తారు. ముందు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం చాలా కీలకం. మరి వరుణ్ అండ్ టీం ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.
ఇదే రోజు వెన్నెల కిషోర్ హీరోగా నటించిన కామెడీ మూవీ ‘చారి 111’, యువ నటుడు శివ కందుకూరి లీడ్ రోల్ చేసిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర నారాయణ’ కూడా రిలీజవుతున్నాయి. మరి వాటి ప్రభావం ఎంతమాత్రం ఉంటుందో?
This post was last modified on March 1, 2024 10:00 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…