Movie News

జాన్వీ కపూర్ అంత రిస్క్ చేస్తుందా

టాలీవుడ్ ఎంట్రీకి దేవర లాంటి సరైన ప్యాన్ ఇండియా మూవీని ఎంచుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి రామ్ చరణ్ 16లోనూ అవకాశమొచ్చిందని తండ్రి బోనీ కపూర్ స్వయంగా చెప్పడం తెలిసిందే. ఈ విషయాన్ని కూతురు ధృవీకరించకపోయినా అంత పెద్ద నిర్మాత స్థానంలో ఉన్న మనిషి మాట వరసకు అబద్దం చెప్పరు కదా. వీటి సంగతలా ఉంచితే పుష్ప 2 ది రూల్ లో ఒక స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ ఈమెను సంప్రదించినట్టు వచ్చిన వార్త ఫ్యాన్స్ మధ్య గట్టిగా తిరుగుతోంది. ఊ అంటావా ఉహూ అంటావాని మించేలా ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినట్టు టాక్.

కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే జాన్వీ నిజంగా ఇది ఒప్పుకుంటుందానే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే పుష్ప 1లో చేసిన సమంతా అప్పటికే స్టార్ స్టేటస్ మొత్తం చూసేసి అందరు హీరోలతో జోడిగా చేసింది. ఒకవేళ పుష్పకు ఏదైనా తేడా జరిగి ఉంటే సామ్ కు ఎలాంటి నష్టం ఉండేది కాదు. జాన్వీ కపూర్ కేసు వేరు. ఇంకా తెలుగులో తెరంగేట్రమే జరగలేదు. పైగా దేవర కంటే ముందు ఆగస్ట్ 15 పుష్ప 2 రిలీజవుతుంది. సో తొలి పరిచయం కార్డు అందులో వేయాల్సి ఉంటుంది. దీనికి బోనీ కపూర్ ఒప్పుకుంటాడానేది పెద్ద ప్రశ్న. టీమ్ అయితే దీని గురించి ఎలాంటి లీక్ ఇవ్వడం లేదు.

ఒకవేళ చేస్తే మాత్రం షాకింగ్ అండ్ స్పెషల్ అనుకోవచ్చు. ఈ స్పెషల్ సాంగ్ కోసం దిశా పటానిని కూడా అడిగారట కానీ డేట్ల సమస్య వల్ల ఎస్ చెప్పలేదనే టాక్ కూడా ఉంది. ఆర్య లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీలోనే ఆ అంటే అమలాపురం లాంటి ఐటెం సాంగ్ తో అదరగొట్టిన సుకుమార్ పుష్ప 2 విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో వేరే చెప్పాలా. ఫస్ట్ లిరికల్ వీడియోగా దీన్నే రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా మైత్రి బృందంలో ఉంది. కాకపోతే షూట్ చేస్తే తప్ప నిర్ణయం తీసుకోలేరు. అల్లు అర్జున్ మాత్రం విడుదల తేదీ మిస్ చేయకూడదనే ఉద్దేశంతో సుక్కుతో డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు.

This post was last modified on March 1, 2024 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…

3 hours ago

బావగారు వివాదం….సుడిగాలి సుధీర్ మెడకు

యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…

3 hours ago

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

5 hours ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

5 hours ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

5 hours ago

తారక్ & రజని రెండుసార్లు తలపడతారా

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…

6 hours ago