పెళ్లి చేసి చూడు అనేది పాత సామెత. సినిమా మార్కెటింగ్ చేసి చూడు అనేది ఇండస్ట్రీ నానుడి. తక్కువ బడ్జెట్ తో గుర్తింపు తప్ప ఇమేజ్ లేని ఆర్టిస్టులతో చిత్రాలు తీస్తున్న నిర్మాతల పరిస్థితి చూస్తే ఇదే గుర్తొస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి నెల దీన్ని పదే పదే ఋజువు చేసింది. ప్రారంభంలో వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకి రివ్యూలు పాజిటివ్ గానే వచ్చాయి. పబ్లిక్ టాక్ డీసెంట్ గానే వినిపించింది. అయినా సరే భారీ వసూళ్లుగా మార్చుకోలేకపోయింది. సుహాస్ కి రైటర్ పద్మభూషణ్, కలర్ ఫోటోని మించిన మార్కెట్, సేలబిలిటీని పెంచుతుందనుకుంటే అదేమీ జారలేదు.
బిగ్ బాస్ కి ఆదరించారు కదా థియేటర్ కు రండయ్యా అంటూ సోహైల్ నెత్తినోరు బాదుకున్నా బూట్ కట్ బాలరాజు మీద ఆడియన్స్ కనీస జాలి చూపించలేదు. కంటెంట్ తేడా ఉండటం వేరే సంగతి. కనీసం ఓపెనింగ్స్ రావాలి కదా. తాజాగా వచ్చిన వాటిలో సుందరం మాస్టర్ అంచనాలు అందుకోలేనట్టే కనిపిస్తోంది. నిర్మాతలు నాలుగు కోట్లకు పైగానే గ్రాస్ వచ్చిందని చెబుతున్నారు కానీ వాస్తవాలు ట్రేడ్ కే ఎరుక. ఇది నయం. అభినవ్ గోమటం మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, దీపక్ సరోజ్ సిద్దార్థ్ రాయ్ లకు స్పందన కరువైంది. చాలా చోట్ల థియేటర్లలో కనీస జనం లేక వెలవెలబోతున్నాయి.
ఇక్కడ ప్రస్తావించినవి కాసింత జనం మైండ్ లో గుర్తున్న సినిమాలే. అసలు వచ్చాయో లేదో ఎవరికీ తెలియనంత వేగంగా వచ్చి వెళ్ళినవి ఇంకో పదికి పైనే ఉన్నాయి. హడావిడి చేసిన డబ్బింగ్ సినిమాలు ట్రూ లవర్, భ్రమ యుగంలు ఇక్కడ సోసోగానే ఆడాయి. ఫిబ్రవరి మాములుగా కొంచెం డ్రైగా ఉండే మాట నిజమే కానీ మరీ బ్యాడ్ సీజన్ కాదు. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్లు వచ్చిన ఉదంతాలు మర్చిపోకూడదు. పాతికేళ్ల క్రితం సూర్యవంశంతో మొదలు మొన్నటి డీజే టిల్లు దాకా చాలా సినిమాలు ఫిబ్రవరి బ్లాక్ బస్టర్లే. కానీ ఈసారి మాత్రం చిన్న సినిమాలకు టైం ఏ మాత్రం కలిసి రాలేదు. మరీ చిన్న సినిమాగా చెప్పలేం కానీ ఒక్క ఊరిపేరు భైరవకోన మాత్రమే బయ్యర్లకు ఊరట కలిగించింది. టీమ్ అఫీషియల్ గా చెప్పిన ప్రకారమే 25 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది.
This post was last modified on February 29, 2024 3:38 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న…