ఊహించని విధంగా ఫిబ్రవరి నెల నిరాశ పరచడంతో టాలీవుడ్ ఆశలన్నీ మార్చికు షిఫ్ట్ అయిపోయాయి. ఒక్క ఊరిపేరు భైరవకోన మాత్రమే రిలీఫ్ ఇవ్వగా రవితేజ ఈగల్ తో సహా మిగిలిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో వేసవికి ప్రీ రిలీజ్ లాంటి మార్చి మీద భారీ నమ్మకం పెట్టుకున్నారు. రేపు ఒకటి, రెండు తేదీల్లో కౌంట్ పరంగా చెప్పుకోదగ్గ నెంబర్ లోనే వస్తున్నాయి. వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మీద అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ వార్ డ్రామా ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకంతో టీమ్ ఉంది.
వెన్నెల కిషోర్ హీరోగా ‘చారి 111’కి పబ్లిసిటీ కంటే ఎక్కువ కంటెంట్ నే నమ్ముకున్నారు నిర్మాతలు. కామెడీ స్పై జానర్ లో ఏదో కొత్త ప్రయోగం చేశారు. శివ కందుకూరి ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ వెరైటీ ప్రమోషన్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విపరీతమైన వాయిదాలకు గురైన రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఏదో అద్భుతం చేస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. షోలు పడే దాకా పోస్ట్ పోన్ ఉండదన్న గ్యారెంటీ లేదు. ఇవి కాకుండా ఇంటి నెంబర్ 13, రాధా మాధవం, మా ఊరి రాజారెడ్డి వస్తున్నాయి. హాలీవుడ్ మూవీ ‘డ్యూన్ పార్ట్ 2’ మీద యూత్, పిల్లల్లో మంచి క్రేజ్ నెలకొంది.
వీటితో పాటు రీ రిలీజ్ క్యాటగిరీలో రవితేజ కిక్, బాలకృష్ణ సమరసింహారెడ్డిలను భారీ ఎత్తున దింపుతున్నారు. ఇంత టైట్ సిచువేషన్ లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు దక్కడం విశేషం. గత వారం వచ్చిన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశ పరచడంతో థియేటర్లు ఫీడింగ్ లేక అలో లక్ష్మణా అంటున్నాయి. హనుమాన్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఇంకో బ్లాక్ బస్టర్ పడలేదు. ఇప్పుడొచ్చే వాటిలో ఆ కొరత ఏది తీరుస్తుందో చూడాలి. బజ్ పరంగా చూసుకుంటే ఆపరేషన్ వాలెంటైన్ ఆధిపత్యం కొంత ఎక్కువని చెప్పొచ్చు. మిగిలినవాటికి పెద్ద ఓపెనింగ్స్ కూడా కష్టం కాబట్టి టాక్ మీదే ఆధారపడాలి.
This post was last modified on February 29, 2024 1:49 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…