మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసుకున్న ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన పనులు బయటికి ఎక్కువ లీక్ కాకుండా చకచకా జరిగిపోతున్నాయి. త్వరలో క్యాస్ట్ అండ్ క్రూతో భారీ వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున ఒక కీలక పాత్ర చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ నెరేషన్ అయిపోయిందని, నాగ్ అంగీకారం వచ్చేసిందని వినికిడి. మహేష్ కి జోడిగా చెల్సియా ఇస్లాన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాగా నాగార్జున సరసన కల్కి భామ దీపికా పదుకునేని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ డీల్ ఇంకా తుదిదశకు చేరుకోలేదట.
ఒకవేళ ఓకే అయితే కాంబినేషన్ మరింత క్రేజీగా మారుతుంది. ఆర్ఆర్ఆర్ కు ఇదే తరహాలో అలియా భట్, అజయ్ దేవగన్ లను తీసుకొచ్చిన జక్కన్న దానికి తగ్గట్టే మంచి ఫలితం అందుకున్నాడు. తక్కువ నిడివి ఉన్న పాత్రలైనా సరే భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి ఒప్పించాడు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని రిపీట్ చేయచ్చు. వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో స్క్రీన్ పంచుకున్న మహేష్ ఇప్పుడు నాగ్ తో కలిసి తెరమీద కనిపిస్తే అంతకంటే అభిమానులకు కావాల్సింది ఏముంటుంది. ఇంకొన్ని రోజుల పాటు ఇలాంటి డీటెయిల్స్ ఏవీ అఫీషియల్ చేయబోరు.
అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ఎప్పుడు ఉండాలనే ముహూర్తం ఇంకా ఫిక్స్ చేయలేదని తెలిసింది. ఉగాది పండగకు చేద్దామా లేక ఇంకో నెల ఆగి ఏప్రిల్ లో ప్రకటిద్దామా అనే ఆలోచన కొలిక్కి రాలేదట. 2026లో విడుదల చేయాలనే సంకల్పంతో పనులు చేస్తున్నారు కానీ ఇది పూర్తిగా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కీరవాణి సంగీతం సమకూర్చబోయే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ కు మహారాజా అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చినా యూనిట్ వర్గాలు మాత్రం సైలెంట్ గా ఉంటున్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 28, 2024 5:44 pm
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…