Movie News

అంతరిక్షం సినిమాకు సగమే తీసుకున్నా

కెరీర్ ఆరంభం నుంచి ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా వైవిధ్యమైన సినిమాలతో సాగిపోతున్నాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. మాంచి మాస్ సినిమాతో పరిచయం కాగల భారీ కటౌట్ ఉన్నప్పటికీ.. ‘ముకుంద’ లాంటి క్లాస్ మూవీతో అతను హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ డామినేషన్ ఉన్న ‘ఫిదా’లో నటించాడు. ‘ఎఫ్-2’ లాంటి కామెడీ మూవీలో భాగం అయ్యాడు. అలాగే అంతరిక్షం లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు. ఈ క్రమంలో కొన్ని ఎదురుదెబ్బలు తిన్నా తట్టుకుని నిలబడ్డాడు.

ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్’ లాంటి మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వరుణ్. ప్రతి సినిమానూ డబ్బు కోణంలోనే చూడకూడదని.. ప్రయోగాత్మక కథలు చేసేటపుడు పారితోషకం విషయంలో వెనక్కి తగ్గడానికి కూడా తాను వెనుకంజ వేయనని వరుణ్ తెలిపాడు.

‘అంతరిక్షం’ సినిమాకు తాను సగం రెమ్యూనరేషనే తీసుకున్న విషయాన్ని వరుణ్ వెల్లడించాడు. తనకు ఇవ్వాల్సిన దాంతో మిగతా సగం మొత్తాన్ని సినిమా కోసమే ఖర్చు చేయమని చెప్పానని.. దర్శకుడు, నిర్మాత అడగకపోయినా తనే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నానని వరుణ్ తెలిపాడు. తన సినిమాకు ఆర్థికంగా ఎక్కువ నష్టం వాటిల్లితే అసలు పారితోషకమే తీసుకోకుండా ఉండిపోవడానికి కూడా తాను సిద్ధమని.. కానీ అలాంటి సందర్భం రాదనుకుంటున్నానని.. వచ్చినా తట్టుకునే శక్తి తనకు ఉందని వరుణ్ తెలిపాడు.

‘ఆపరేషన్ వాలెంటైన్’ తన కెరీర్లో అత్యంత కష్టపడి, తపనతో చేసిన సినిమా అని.. ఈ సినిమా కోసం తన పెళ్లి ముహూర్తం కూడా వాయిదా వేసుకున్నానని వరుణ్ వెల్లడించడం విశేషం. ఈ చిత్రం కోసం హిందీలో శిక్షణ తీసుకుని, సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పానని.. కానీ యాస కుదరక తర్వాత వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పారని అతను తెలిపాడు. మార్చి 1న ‘ఆపరేషన్ వాలెంటైన్’ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on February 28, 2024 2:16 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

1 hour ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

3 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

8 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

9 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

10 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

10 hours ago