ఎల్లుండి వెన్నెల కిషోర్ చారి 111 విడుదల కానుంది. స్పై బ్యాక్ డ్రాప్ లో కామెడీ కం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించినట్టు ట్రైలర్ చూశాక అర్థమైపోయింది. ప్రస్తుతానికి దీని మీద ఎలాంటి బజ్ కనిపించడం లేదు. టీమ్ కాన్ఫిడెన్సో లేక టాక్ తో నిలబడతామనే ధీమానో ఏమో కానీ హీరో ముందు పెద్ద సవాల్ నిలవనుంది. గత వారం ఇద్దరు కమెడియన్లు కథానాయకులుగా లాంచ్ అయ్యారు. హర్ష చెముడు సుందరం మాస్టర్ ని రవితేజ లాంటి పెద్ద హీరో నిర్మించినా కంటెంట్ బలహీనంగా ఉండటం వల్ల ఆడియన్స్ తిరస్కారానికి గురయ్యింది. హర్ష ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు.
అభినవ్ గోమటం మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రాని పబ్లిక్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈవెంట్లు గట్రా చేశారు కానీ ప్రేక్షకులకు కనీసం వచ్చిందన్న విషయం కూడా రిజిస్టర్ కానంత దారుణంగా దెబ్బ తింది. టాక్ ఓ మోస్తరుగా సోసో అన్నారు కానీ జనాన్ని థియేటర్లకు రప్పించేంత మ్యాటర్ లేదని తేలిపోవడంతో ఫ్లాప్ ముద్ర తప్పలేదు. ఇప్పుడు వెన్నెల కిషోర్ వంతు వచ్చింది. కొత్తగా తను ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమి లేదు కానీ ఇతని ఇమేజ్ ఓపెనింగ్స్ తెస్తుందని నమ్మకంతో ఉన్న ప్రొడ్యూసర్ల ఆశలు నెరవేరాలంటే మాములు హిట్ అనిపించుకుంటే సరిపోదు.
జాతిరత్నాలు రేంజ్ టాక్ వస్తే తప్ప చారి 111 నిలదొక్కుకోవడం కష్టం. పోటీలో ఉన్న ఆపరేషన్ వాలెంటైన్ కోసం వరుణ్ తేజ్ రెండు వారాలుగా నాన్ స్టాప్ ప్రమోషన్లు చేస్తుంటే అందులో కనీసం సగం కూడా వెన్నెల కిషోర్ వైపు నుంచి జరగలేదు. కారణాలు ఏంటో కానీ సినిమా చూశాక ఒక క్లారిటీ రావొచ్చు. ఇకపై ఈ సిరీస్ లో వరసగా సినిమాలు తీస్తానని దర్శకుడు టిజి కీర్తి కుమార్ అంటున్నాడు. పెద్ద స్టార్లు భాగమవుతారట. రుద్రనేత్ర స్ఫూర్తిగా చెప్పి మెగా ఫాన్స్ ని టార్గెట్ చేశాడు. ఇవన్నీ ఓకే కానీ అసలే స్తబ్దుగా ఉన్న బాక్సాఫీస్ కు జోష్ తెచ్చే విజేత ఎవరో ఇంకో రెండు రోజుల్లో తేలిపోతుంది.
This post was last modified on February 28, 2024 9:48 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…