మెగాస్టార్ చిరంజీవి ఎంత అప్ టు డేట్‌గా ఉంటారు అనడానికి ఇది ఉదాహరణ. ఈ తరం కమెడియన్లలో ఒకరైన అభినవ్ గోమఠంను ఆయన స్టేజ్ మీద అనుకరించడం విశేషం. అభివన్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా.. ఈ నగరానికి ఏమైంది. అందులో అభినవ్ డైలాగులు కొన్ని కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నాయి. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో.. హేయ్ కమల్ హాసన్.. ఇలాంటి డైలాగులు మీమ్ మెటీరియల్స్‌గా మారిపోయాయి.
సందర్భానికి తగ్గట్లు వీటిని సోషల్ మీడియా జనాలు విరివిగా వాడేస్తుంటారు. చిరంజీవి దృష్టిలో కూడా ఇవి పడ్డ విషయం ఇప్పుడే తెలిసిందే. ఆ డైలాగులు చెబుతూ.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అభినవ్‌ను మెగాస్టార్ అనుకరించడం విశేషం.
తాను కూడా అప్పుడప్పడూ టైంపాస్ కోసం సోషల్ మీడియాలో జోక్స్, మీమ్స్ అవీ చూస్తుంటానని.. అలా తన దృష్టిలో ఒక కమెడియన్ పడ్డాడని.. తరచుగా అతడి మీమ్స్ చూస్తుంటానని చెబుతూ అభినవ్ పేరు పలికాడు చిరు. వెంటనే అభినవ్ చిరు దగ్గరికి వెళ్లగా.. ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా నీలో’.. ‘హేయ్ కమల్ హాసన్’’ అంటూ అభినవ్ స్టయిల్లోనే చిరు డైలాగులు చెప్పారు. దీంతో ఆడిటోరియల్ హోరెత్తింది. తర్వాత చిరు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. అంతకుముందు అభినవ్ ప్రసంగాన్ని ప్రస్తావించాడు.
చిన్నతనంలో చిరుతో ఉన్న నోస్టాల్జిక్ ఫీలింగ్స్ గురించి అభినవ్ మాట్లాడగా.. అలా తన గురించి చెప్పినపుడు తాను కూడా ఎంతో ఎంజాయ్ చేస్తానని.. అది తనకెంతో ఉత్సాహాన్ని ఇస్తుందని చిరు చెప్పాడు. ఈ మాటలతో అభినవ్ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. అభినవ్ ఈ మధ్యే హీరోగా ఓ సినిమా చేయగా.. దానికి ‘మస్తు షేడ్స్ ఉన్నాయి రా’ అనే టైటిలే పెట్టుకోవడం విశేషం.
This post was last modified on February 26, 2024 8:00 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…