దక్షిణాదిన కంటెంట్ పరంగా మంచి క్వాలిటీతో, ఎంతో వైవిధ్యంతో సినిమాలు తీసే ఇండస్ట్రీ ఏదంటే మలయాళ పరిశ్రమ పేరే చెప్పాలి. దశాబ్దాల కిందట్నుంచి కంటెంట్ పరంగా మాలీవుడ్ చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇప్పటికీ ఆ ఒరవడి కొనసాగుతోంది. ఓటీటీల పుణ్యమా అని మలయాళ సినిమాల స్థాయి ఏంటో అందరికీ మరింతగా తెలుస్తోంది.
ఆన్ లైన్లో మలయాళ సినిమాలు చూసిన ఇతర భాషా ప్రేక్షకులు.. నెమ్మదిగా థియేటర్లలోనూ వాటిని చూసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. దీంతో మలయాళంలో హిట్టయిన సినిమాలను ఇతర భాషల్లో పేరున్న నిర్మాణ సంస్థలు రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఈ మధ్యే ‘భ్రమయుగం’ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ బేనర్లలో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేసింది. స్పందన పర్వాలేదు.
ఇప్పుడు మరో మలయాళ హిట్ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ మూవీనే.. ప్రేమలు. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పెద్ద హీరోల సినిమాల స్థాయిలో దీనికి వసూళ్లు వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ ప్రేమకథ హైదరాబాద్ నేపథ్యంలో సాగుతుంది.
ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు మల్టీప్లెక్సులు ఈ సినిమాను ప్రదర్శిస్తుండగా.. మంచి ఆక్యుపెన్సీలతో షోలు నడుస్తున్నాయి. ఇప్పుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. మార్చి 8న ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ రిలీజ్ కాబోతోంది. ఆ రోజు గోపీచంద్ మూవీ ‘భీమా’; విశ్వక్సేన్ సినిమా ‘గామి’లకు పోటీగా రిలీజ్ కానున్న ఈ అనువాద చిత్రం ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
This post was last modified on February 26, 2024 8:17 pm
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…