ప్రభాస్ కల్కి 2898 ఏడి విడుదల మే 9నే ఉంటుందని యూనిట్ వర్గాలు నొక్కి చెబుతున్నాయి. ఒకవేళ ఇది వాయిదా పడే క్రమంలో ఇండియన్ 2 లాంటివి ఆ స్లాట్ ని తీసుకునేందుకు ఎదురు చూస్తున్న తరుణంలో వాయిదా వార్తలు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు నాగ అశ్విన్ ఎక్కడైనా బయట కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వీలైనంత కబుర్లు కల్కి గురించి పంచుకుంటున్నారు. వాటిలో భాగంగానే ఈ సినిమా 6000 సంవత్సరాల కాల క్రమంలో, మహాభారతంతో మొదలై భవిష్యత్తులో వచ్చే 2898 సంవత్సరం దాకా జరుగుతుందని కీలకమైన క్లూస్ ఇచ్చాడు.
హాలీవుడ్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ బ్లేడ్ రన్నర్ తరహా ఛాయలు విన్నప్పుడు అనిపించినా ఏ కోశానా అలాంటి పోలికలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నామని క్లారిటీతో చెప్పాడు. భారతం అంటే పాండవులు, కౌరవులు, కృష్ణుడు ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. అసలే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని క్యామియోల గురించి ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే కురుక్షేత్ర సంగ్రామం తాలూకు సాంపిల్ చూపించి వీళ్ళను ఏమైనా వాడుకునే స్కెచ్ వేశారేమో చూడాలి. విజువల్ ఎఫెక్ట్స్ కు పెద్ద పీఠ వేస్తున్న కల్కిలో పురాణాల రిఫరెన్స్ బలంగా ఉంటాయట.
రిలీజ్ డేట్ గురించి అనుమానాలు కాదు కానీ వీలైనంత త్వరగా ప్రమోషన్లు మొదలుపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. మే 9 ఎంతో దూరంలో లేదు. సరిగ్గా ఇంకో డెబ్భై మూడు రోజులు కౌంట్ డౌన్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి డబ్బింగ్ వగైరా పనులు చాలా ఉంటాయి. అందులోనూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో ప్లాన్ చేసుకున్నారు. వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ కావడంతో బిజినెస్ వర్గాల్లో చాలా క్రేజ్ ఉంది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు డివైడ్ టాక్ వచ్చినా ప్రభాస్ వందల కోట్లు కొల్లగొట్టాడు. ఇక కల్కి 2898కి ఆకాశమే హద్దుగా మారుతుందేమో.
This post was last modified on February 26, 2024 1:02 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…