నిన్న సాయంత్రం ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా పద్మభూషణ్ పురస్కారం ప్రకటించాక ఆయన హాజరైన ఇండస్ట్రీ సినిమా ఈవెంట్ ఇదే కావడంతో అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా చిరు తనదైన శైలిలో పంచులు, చమక్కులతో మెరిపించారు. కమెడియన్ అభినవ్ గోమటంని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మధ్య సోషల్ మీడియా మీమ్స్ లో మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా అంటూ ఒక వ్యక్తి బాగా ఆకట్టుకున్నాడని అతని స్టైల్ లోనే డైలాగు చెప్పడం స్టేజి మీద ఓ రేంజ్ లో పేలింది.
పక్కనే ఉన్న అభినవ్ ఏకంగా కాళ్ళ మీద పడినంత పని చేశాడు. యాంకర్ సుమ చిరు లీక్స్ ప్రస్తావన తెచ్చినప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ప్రేమలో ఉన్న సంగతి తన దగ్గర దాచారని, నాగబాబు కన్నా ఎక్కువగా నాతోనే చనువుగా ఉండే వరుణ్ ఇది మాత్రం రహస్యంగా ఉంచడం పట్ల హర్ట్ అయ్యాయని సరదాగా చెప్పడం, దానికి బదులుగా మెగా ప్రిన్స్ గౌరవంతో అలా చేసినా తర్వాత ముందు చెప్పింది పెదనాన్నకేనంటూ బదులు చెప్పడం జరిగిపోయాయి. ఈ సందర్భంగానే ఒక ఫోటో గురించి వివరిస్తూ వరుణ్ చిన్నప్పుడు చైనీస్ అబ్బాయిలా ఉండేవాడన్న సంగతి గుర్తు చేసుకున్నారు.
సుమని ఉద్దేశించి చిరంజీవి మరో పంచు వేస్తూ తన మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పడంతో అందరూ ఘొల్లుమన్నారు. ఇలా సరదాగా నవ్వించిన చిరు అసలు ప్రసంగంలో ఆపరేషన్ వాలెంటైన్ ప్రాముఖ్యత, పుల్వామా దాడిలో మన సైనికులు చూపించిన సాహసం గురించి చెబుతూ ఇలాంటి సినిమాలు ప్రోత్సహించడం ద్వారా వాళ్లకు సెల్యూట్ చేయాలని కోరారు. కొంత గ్యాప్ తర్వాత పబ్లిక్ ఈవెంట్ లో కనిపించిన తీరు తమ ముద్రని చూపించారు. విశ్వంభర రెగ్యులర్ షూటింగ్ ఇవాళ హైదరాబాద్ లో కొనసాగనుంది.
This post was last modified on February 26, 2024 1:01 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…